ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఉక్కపోత.. కరెంటు మోత!

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:35 AM

వానాకాలంలోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్‌ వాడకం కూడా పెరిగిపోతోంది.

  • రాష్ట్రంలో 228.94 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌

  • 20 కోట్లతో బహిరంగ మార్కెట్లో 38.744 ఎంయూ కొనుగోలు

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): వానాకాలంలోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్‌ వాడకం కూడా పెరిగిపోతోంది. ఉక్కపోతకు ఏసీలు(ఎయిర్‌ కండీషన్లు) వాడకపోతే ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఏకంగా 228.941 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడింది.

190.197 ఎంయూ విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్‌కు రూ.6.503 చొప్పున 38.744 ఎంయూ విద్యుత్‌ను రూ.20.806 కోట్లకు కొనుగోలు చేశాయి. కాగా, పొడి వాతావరణంతో రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ 18.833 ఎంయూ, పవన విద్యుత్‌ 4.025 ఎంయూ, సెంట్రల్‌ జనరేటింగ్‌ స్టేషన్ల ద్వారా 38.001 ఎంయూ, ఏపీజెన్కో సోలార్‌ ద్వారా 2.647 ఎంయూ, ఏపీ జెన్కో హైడల్‌ 25.304 ఎంయూ, ఏపీ జెన్కో థర్మల్‌ 74.215 ఎంయూ ఉత్పత్తి అవుతోంది.

Updated Date - Aug 19 , 2024 | 03:35 AM

Advertising
Advertising
<