Amaravati : నిలిచిన స్టాంపు పేపర్ల సరఫరా
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:10 AM
రాష్ట్రానికి స్టాంపు పేపర్ల సరఫరా నిలిచిపోయింది. స్టాంపు పేపర్లు ఎక్కువ శాతం నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నుంచి సరఫరా అవుతాయి.
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పంపిస్తాం.. హైదరాబాద్, నాసిక్ ప్రెస్‌ల స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి స్టాంపు పేపర్ల సరఫరా నిలిచిపోయింది. స్టాంపు పేపర్లు ఎక్కువ శాతం నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నుంచి సరఫరా అవుతాయి. స్వల్పస్థాయిలో అయితే హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పంపుతారు. గత ప్రభుత్వంలో నాసిక్ ప్రెస్ నుంచి రూ.90 కోట్లు విలువైన రూ.50, రూ.100 స్టాంపులను తెప్పించారు. కానీ, వాటికి బిల్లులు చెల్లించలేదు. అలాగే పేదలకు ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ ప్రెస్ నుంచి రూ.10, రూ.20 విలువైన స్టాంపు పేపర్లు తెప్పించారు. వీటి విలువ దాదాపు రూ.20 కోట్లు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. వాటిలో కనీసం సగమైనా చెల్లిస్తేనే తిరిగి స్టాంపుపేపర్ల సరఫరాను పునరుద్ధరిస్తామని ఈ రెండు ప్రెస్‌ల అధికారులు స్పష్టం చేశారు.
Updated Date - Sep 13 , 2024 | 04:10 AM