ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఈఎస్‌ఐపై విజి‘లెన్స్‌’!

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:48 AM

ఈఎస్‌ఐ‌పై కార్పొరేషన్‌ చరిత్రలో ఎప్పుడూ జరగని.. ఎవరూ ఊహించని కుంభకోణం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐ‌ ఆస్పత్రి పేరుతో కోట్ల రూపాయల ఖరీదుచేసే మందులు కొనుగోలు చేసి..

  • జగన్‌ హయాంలో మందుల కొను‘గోల్‌మాల్‌’పై దృష్టి.. రాజమండ్రి ఆస్పత్రి పేరుతో భారీగా పీవోలు

  • లోకల్‌ పర్చేజ్‌ నిబంధన మాటున పెద్ద స్కాం.. డమ్మీ ఏజెన్సీని సృష్టించి తక్కువ ధరకు మందుల కొనుగోలు

  • రూ.3 కోట్లకు కొని, బయట రూ.60 కోట్లకు అమ్మకం.. సూత్రధారి వసూల్‌రాజాయే!

  • నాడే వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’.. తూతూమంత్రంగా విచారణ.. ఏమీ జరగలేదని నివేదిక

  • ఇప్పుడు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈఎస్‌ఐ‌పై కార్పొరేషన్‌ చరిత్రలో ఎప్పుడూ జరగని.. ఎవరూ ఊహించని కుంభకోణం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐ‌ ఆస్పత్రి పేరుతో కోట్ల రూపాయల ఖరీదుచేసే మందులు కొనుగోలు చేసి.. వాటిని ప్రైవేటు మార్కెట్లో నాలుగు రెట్లు ఎక్కువకు అమ్మి సొమ్ము చేసుకున్న ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే ‘ఈఎ్‌సఐలో మందుల మాయ’ శీర్షికతో వెలుగులోకి తీసుకొచ్చింది.

దీనిపై జగన్‌ సర్కారు విచారణ కమిటీ వేసింది. అది తూతూ మంత్రంగా విచారణ చేసి కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను గత ప్రభుత్వం పక్కన పడేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ స్కాంను వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

దీనిపై విచారణ చేపట్టాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎ.ం.నాయక్‌.. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హరీశ్‌కుమార్‌ గుప్తాకు నివేదించారు. దీనిపై 2-3 రోజుల్లోనే విచారణ ప్రారంభం కానుంది.


అసలేం జరిగింది..?

ఈఎ్‌సఐ నిబంధనల ప్రకారం ఆస్పత్రులకు అవసరమైన మందులన్నీ.. కేంద్రం ఎంపిక చేసిన కంపెనీల నుంచే కొనుగోలు చేయాలి. ఇవి కాకుండా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు అత్యవసర మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొనుగోలు చేయడానికి కొంత వెసులుబాట ఉంటుంది. అది కూడా మూడు నెలల వ్యవధిలో లక్ష రూపాయలకు మించకూడదు. అదికూడా ‘లోకల్‌ పర్చేజ్‌’ నిబంధన కింద స్థానికంగా టెండర్లు పిలిచి, ఒక ఏజెన్సీని ఎంపిక చేసుకుని దానిద్వారానే కొనుగోలు చేయాలి.

జగన్‌ హయాంలో ఈఎ్‌సఐ ఉన్నతాధికారులు సరిగ్గా ఈ లోకల్‌ పర్చేజ్‌ రూల్‌ను ఆసరా చేసుకునే భారీ స్కాంకు పాల్పడ్డారు. వారు హైదరాబాద్‌లో మందులు తయారు చేసే కంపెనీల ప్రతినిధులతో ప్రైవేటుగా సమావేశమయ్యారు.

ఐదు ప్రాంతాల నుంచి లోకల్‌ పర్చేజ్‌ కింద ఈఎ్‌సఐ తరఫున భారీ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తామని.. బయటి మార్కెట్‌ కంటే బాగా తక్కువకు వాటిని విక్రయించాలని బేరం మాట్లాడుకున్నారు. కొన్ని కంపెనీలు 80 శాతం తక్కువకే మందులు సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఆ ఒప్పందం మేరకు ఈఎ్‌సఐ ఉన్నతాధికారులు తొలుత రాజమండ్రి నుంచి లోకల్‌ పర్చేస్‌ ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించారు.

ఈ టెండర్లలో అప్పటికే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు పాల్గొనడానికి లేదు. దీంతో ఉన్నతాధికారులే ఒక డమ్మీ ఏజెన్సీని సృష్టించారు. రాజమండ్రి సూపరింటెండెంట్‌ పిలిచిన టెండర్లల్లో సదరు డమ్మీ సంస్థ ద్వారా బిడ్‌ వేయించారు. దానినే ఎల్‌1గా ఎంపిక చేశారు.

ఒకేసారి, ఒకే రోజు రూ.3 కోట్ల విలువైన మందుల కొనుగోలుకు పీవో (పర్చేజ్‌ ఆర్డర్‌)లు సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం మూడు నెలలకు కలిపి రూ.లక్షకు మించి పీవోలు ఇవ్వకూడదు.

కానీ ఒకేరోజు రూ.3 కోట్లకు పీవోలు సిద్ధం చేశారు. మరో విషయం ఏమిటంటే ఆర్డర్‌ విలువ ఎంతైనా సూపరింటెండెంట్లకు మాత్రమే సరఫరా చేయాలి. కానీ ఉన్నతాధికారులు నేరుగా ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌కు తెప్పించుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ప్రతినిధులతో మళ్లీ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పీవోలను నేరుగా వారికి ఇచ్చేసి, వెంటనే మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. పీవోలు మొత్తం రాజమండ్రి సూపరింటెండెంట్‌ పేరుతోనే ఇవ్వడం గమనార్హం.


ప్రైవేటు గోదాముకు..

రాజమండ్రి సూపరింటెండెంట్‌ పేరుతో ఇచ్చిన పీవోల ఆధారంగా కంపెనీలు మందులన్నిటినీ రాజమండ్రి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌(సీడీఎ్‌స)కు సరఫరా చేయాలి. కానీ ఉన్నతాధికారులు వాటిని ప్రైవేటు గోదాముకు తరలించారు.

ఈఎ్‌సఐకి రూ.2కి వచ్చిన ఒక్కో మాత్ర ధర.. బయటి మార్కెట్లో దాదాపు రూ.10 ఉంది. కొనుగోలు చేసిన దానికంటే 8 రూపాయలు అధికంగా వస్తుందని వెంటనే ఆ మందులను ఈఎ్‌సఐ ఉన్నతాధికారులే బయటి మార్కెట్లో అమ్మేశారు. మూడు ప్రాంతాల నుంచి ఇలా దాదాపు రూ.60 కోట్లు స్కాం చేశారు.


వసూల్‌ రాజా హస్తం..

ఈ వ్యవహారం వెనుక కర్త, కర్మ, క్రియ మొత్తం నాటి సీఎంవోలో చక్రం తిప్పిన వసూల్‌ రాజాయే. స్కాంను అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురాగానే ఆయన రంగంలోకి దిగారు. మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు.

విజిలెన్స్‌ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితే గుట్టు రట్టవుతుందని, ఈఎ్‌సఐ ఉన్నతాధికారులతో పాటు తన తలకూ చుట్టుకుంటుందని విచారణ తూతూ మంత్రంగా ముగించాలని భావించారు.

శాఖపరమైన విచారణతో సరిపెట్టాలని సీఎంవో నుంచి ఒత్తిడి తెచ్చారు. ఓ కమిటీని వేసి అక్రమాలు జరగలేదని రిపోర్టు తెప్పించుకుని కేసు క్లోజ్‌ చేయాలని చూశారు. ఇప్పుడు విజిలెన్స్‌ విచారణలో ఈ మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉంది.

Updated Date - Aug 26 , 2024 | 03:48 AM

Advertising
Advertising
<