Krishna water: కృష్ణా జలాలపై విచారణ ఆగస్టు 28, 29తేదీలకి వాయిదా..
ABN, Publish Date - Jul 15 , 2024 | 08:13 PM
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్‌లో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏపీ తరఫు లాయర్లు కోరారు. దీనికి అనుమతిస్తూ అఫిడవిట్ దాఖలుకు ట్రైబ్యునల్ 4వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 28, 29తేదీలకి వాయిదా వేసింది.
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్‌లో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏపీ తరఫు లాయర్లు కోరారు. దీనికి అనుమతిస్తూ అఫిడవిట్ దాఖలుకు ట్రైబ్యునల్ 4వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 28, 29తేదీలకి వాయిదా వేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచినా విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా వీటిని పరిష్కరించుకునేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టంలోని కృష్ణా జలాల పంపిణీ కూడా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నీటి పంపిణీ విషయంలో 2024 ఏప్రిల్ 8నుంచి బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్-3 ప్రకారం విచారణ చేసి ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్-89పక్కన పెట్టిన ట్రైబ్యునల్.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టింది.
Updated Date - Jul 15 , 2024 | 08:13 PM