A cell is enough..! సెల్ ఉంటే చాలు..!
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:10 AM
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులంతా సెల్‌ఫోనలో నిమగ్నమవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రజా సమస్యలతో పనేమి?
- గ్రీవెన్సలో సెల్‌ఫోనతో అధికారుల కాలక్షేపం
యల్లనూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులంతా సెల్‌ఫోనలో నిమగ్నమవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనైనా సమస్యలు చెబుదామని వస్తే అధికారులంతా సెల్‌ఫోనలో మునిగిపోతే ఇంక మా సమస్యలు ఏం వింటారని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక తహస్దీర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ రాజా మొదలు ఇనచార్జ్ ఎంపీడీఓ వాసుదేవరెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజామణి, ఏపీఎం ముత్యాలప్ప, ఏఓ రామకృష్ణలు సెల్‌ఫోన చూస్తూ కాలక్షేపం చేశారు. వీరు ఇలా ఉంటే అర్జీలు ఇచ్చినప్పటికి సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇంక అర్జీలు ఇచ్చి ఏమి ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Dec 24 , 2024 | 01:10 AM