Share News

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

ABN , Publish Date - May 29 , 2024 | 12:05 AM

నార్పలలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాల యం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా  ఆలయ వార్షికోత్సవం
అలంకరణలో అయ్యప్ప స్వామి

నార్పల, మే 28: నార్పలలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాల యం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జీవీ బ్రహ్మేంద్రస్వామి ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారి మూల విరాటుకు నెయ్యి, పంచామృతాభిషేకం నిర్వహించి, స్వామి వారికి విశేషపుష్పాలంకరణ చేసి పూజలు చేశారు. హోమం నిర్వహించారు. షిర్డి సాయిబాబా భక్తులు, భజనలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు.

Updated Date - May 29 , 2024 | 12:05 AM