Share News

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు తర్వాత రిటైర్ మెంట్‎పై రోహిత్ క్లారిటీ

ABN , Publish Date - Mar 10 , 2025 | 07:55 AM

భారత క్రికెట్ అభిమానుల్లో రోహిత్ శర్మ రిటైర్ మెంట్‎ గురించి వచ్చి ఊహాగానాలకు బ్రేక్ పడింది. తాజాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న తర్వాత రోహిత్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు తర్వాత రిటైర్ మెంట్‎పై రోహిత్ క్లారిటీ
Rohit Sharma

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెల్చుకున్న తర్వాత, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన రిటైర్ మెంట్ గురించి స్పష్టత ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన రోహిత్, "నేను రిటైర్ కావడం లేదు. నేను భారత్ తరఫున వన్డేలు ఆడుతూనే ఉంటానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మకు సంబంధించిన రిటైర్మెంట్ ఊహాగానాలకు ముగింపు పలికాయని చెప్పవచ్చు. అయితే మీడియా సమావేశం ముగిసిన తర్వాత కుర్చీని వదిలి వెళ్ళే సమయంలో రోహిత్ ఈ విషయం గురించి చెప్పారు. ఇంకో విషయం, నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు చెప్పాల్సి వచ్చిందన్నారు. చాలా ధన్యవాదాలని ఈ సందర్భంగా రోహిత్ తెలిపారు.


ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కూడా

అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ రిటైర్ మెంట్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. కానీ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ తన ప్రకటనతో వాటికి ముగింపు పలికాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ప్రదర్శించిన ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ స్లో పిచ్‌పై ఆడింది. కానీ వాటిలో నాలుగు మ్యాచ్‌లను లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనే గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కూడా టీమిండియా గెలిచి అజేయంగా నిలవడం విశేషం.


ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మ్యాజిక్

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో, ఆ తర్వాత సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 83 బంతుల్లో 76 పరుగులు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది టీమ్ ఇండియా విజయంలో చాలా పాత్ర పోషించింది. దీంతో భారత జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ ప్రస్తుతం తన ఆటను కొనసాగించడానికి, జట్టుకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రోహిత్ వన్డేలు ఆడటం కొనసాగిస్తానని చెప్పినప్పటికీ, దక్షిణాఫ్రికాలో 2027 ప్రపంచ కప్‌కు సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 10 , 2025 | 08:25 AM