ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

COLLECTOR : రేపటి నుంచి అడ్వాన్సడ్‌ సప్లీ పరీక్షలు

ABN, Publish Date - May 23 , 2024 | 12:24 AM

ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో శుక్రవారం నుంచి జూన ఒకటో తేదీవరకూ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల అదికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ...

Collector Vinod Kumar speaking in the review of inter exams

ఏర్పాట్లపై కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ సమీక్ష

అనంతపురం టౌన, మే 22: ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో శుక్రవారం నుంచి జూన ఒకటో తేదీవరకూ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల అదికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2-30 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు మొదటి సంవత్సరం 16,901 మంది, ద్వితీయ సంవత్సరం 5,609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో రామక్రిష్ణారెడ్డి, డీవీఈఓ వెంకటరమణ నాయక్‌, డీఈఓ వరలక్ష్మి, ఇనచార్జ్‌ డీఎంహెచఓ డాక్టర్‌ సుజాత, విద్యుత, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.


పది పరీక్షలకు 45 కేంద్రాలు

పరీక్ష రాసేరోజూ ఫీజు చెల్లించొచ్చు: డీఈఓ

అనంతపురం విద్య, మే 22: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని డీఈఓ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన 3 వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు ఉంటాయని తెలిపారు. మొత్తం 13,332 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే రోజుకూడా విద్యార్థులు ఫీజు చెల్లించి, హాల్‌ టికెట్లు డౌనలోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చునని తెలిపారు.


అన్ని యజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని, అందరూ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని, ఫెయిల్‌ అయిన విద్యార్థులంతా పరీక్షలు రాసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూడాలని కోరారు. వచ్చే ఏడాది 10వ తరగతి సిలబస్‌ పూర్తిగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు మిస్‌ కాకుండా చూడాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:24 AM

Advertising
Advertising