మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజాసేవ చేసేందుకు ముందుంటా

ABN, Publish Date - May 20 , 2024 | 11:55 PM

ప్రజాసేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటానని టీడీపీ సీనియర్‌ నాయకుడు నాగరాజు అన్నారు. సోమవారం నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాసేవ చేసేందుకు ముందుంటా
నాగరాజును సత్కరిస్తున్న టీడీపీ నాయకులు

హిందూపురం, మే 20: ప్రజాసేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటానని టీడీపీ సీనియర్‌ నాయకుడు నాగరాజు అన్నారు. సోమవారం నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మీనాగరాజును సత్కరించారు. నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మా కుటుంబానికి పెద్దపీట వేసిందన్నారు. పార్టీతోపాటు నాయకులు కార్యకర్తల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నారు. వారికోసం జీవితాంతం పనిచేస్తానన్నారు.


ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే పార్టీ, కార్యకర్తలే కారణమన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహాయ సహకారాలతో పార్టీకి, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నాగరాజుకు ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంచారు. టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, మంగేష్‌, ఖలీల్‌ఖాన, బాబురెడ్డి, రఫీక్‌, లింగారెడ్డి, లక్ష్మీదేవమ్మ, రమేష్‌, షెక్షావలి, చలపతి, అచ్యుత ప్రసాద్‌, రాజేష్‌, వినిత, టైలర్‌ గంగాధర్‌, మహేష్‌, అంజాద్‌, అంజి, ఖాన, అన్సర్‌, విజయలక్ష్మి, ఉమాశంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్‌ అశ్వత్థ నారాయణరెడ్డి, జయప్ప, రంగారెడ్డి, ప్రవీణ్‌, భార్గవ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:55 PM

Advertising
Advertising