Department of Education, SSA : ఏమైనా చేయొచ్చు..!
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:13 AM
సమగ్రశిక్ష, జిల్లా విద్యాశాఖ పరిధిలో ఎన్ని తప్పులు జరిగినా, ఏం చేసినా అధికారులు చర్యలు తీసుకోరు. కార్యాలయం నుంచి ముఖ్యమైన ఫైళ్లను బయటకు తీసుకెళ్లినా పట్టించుకోరు. ఎవరికి ఏ ఫైల్ కావాలంటే అది ఇట్లే బయటకు వచ్చేస్తుంది. ఏ టీస్టాల్ వద్దనో నింపాదిగా చూసుకుని, తరువాత తిప్పి పంపవచ్చు. సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఇటీవల ఇద్దరు ఉద్యోగులు ఓ ఫైల్‌ను ఇలాగే బయటకు తెచ్చారు. సమీపంలోని ఓ టీస్టాల్ వద్దకు వాటిని తీసుకుపోయారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన సూపరింటెండెంట్ ...
తప్పు చేసినా శిక్షలుండవ్
విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏలో అంతే..!
అనంతపురం విద్య, జూలై 12: సమగ్రశిక్ష, జిల్లా విద్యాశాఖ పరిధిలో ఎన్ని తప్పులు జరిగినా, ఏం చేసినా అధికారులు చర్యలు తీసుకోరు. కార్యాలయం నుంచి ముఖ్యమైన ఫైళ్లను బయటకు తీసుకెళ్లినా పట్టించుకోరు. ఎవరికి ఏ ఫైల్ కావాలంటే అది ఇట్లే బయటకు వచ్చేస్తుంది. ఏ టీస్టాల్ వద్దనో నింపాదిగా చూసుకుని, తరువాత తిప్పి పంపవచ్చు. సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఇటీవల ఇద్దరు ఉద్యోగులు ఓ ఫైల్‌ను ఇలాగే బయటకు తెచ్చారు. సమీపంలోని ఓ టీస్టాల్ వద్దకు వాటిని తీసుకుపోయారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన సూపరింటెండెంట్ సునీల్ పురమాయించడంతో ఆ పని చేశారు. ఆయనతోపాటు జూనియర్ అసిస్టెంట్
బాలకుళ్లాయప్ప, ఓ అటెండర్ టీస్టాల్ వద్ద కూర్చుని ఆ ఫైల్‌ను పరిశీలించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో ఇటీవల కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి, వివరాలు కోరారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఫైల్ రాశారు. ఆ ఫైల్‌ను ఏపీసీ వైఖోమ్ నిదియా దేవికి పంపారు. అక్కడి నుంచి ప్రాజెక్టుకు డీపీసీగా వ్యవహరించే డీఈఓ వరలక్ష్మికి కూడా పంపించారని సమాచారం. అలా.. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి ఫైల్ తిరుగుతోంది. కానీ బాధ్యులపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని, చర్యలు తీసుకునే ఆలోచన కూడా అధికారుల్లో కనిపించడం లేదని విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులే అంటున్నారు. ఫైళ్లను బటకు తెప్పించిన సునీల్ సూపరింటెండెంట్ కావడంతో.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కడప ఆర్‌జేడీకి నివేదించారు. అక్కడ కూడా ఇప్పటి వరకూ చలనం లేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 13 , 2024 | 12:13 AM