Share News

AP welfare: ఐదేళ్లయినా అక్కడే..!

ABN , Publish Date - May 04 , 2024 | 12:02 AM

జగనరెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో నిండా నిర్లక్ష్యం వహించింది. మండలంలోని కల్లూరులో తె లుగుదేశం ప్రభుత్వం హయాంలో చే పట్టిన షాదీఖానా భవన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2018లో ముస్లింల సంక్షేమానికి టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి సుమారు రూ.15 లక్షలు సొంత డబ్బుతో స్థలం కొనుగోలు చేసి షాదీఖానా కోసం ఇచ్చారు.

AP welfare: ఐదేళ్లయినా అక్కడే..!
A stalled Shaadikhana in Kallur

5 శాతమే పెండింగ్‌... ముందుకు సాగని వైనం...

షాదీఖానా నిర్మాణంలో నిర్లక్ష్యం

గార్లదిన్నె: జగనరెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో నిండా నిర్లక్ష్యం వహించింది. మండలంలోని కల్లూరులో తె లుగుదేశం ప్రభుత్వం హయాంలో చే పట్టిన షాదీఖానా భవన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2018లో ముస్లింల సంక్షేమానికి టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి సుమారు రూ.15 లక్షలు సొంత డబ్బుతో స్థలం కొనుగోలు చేసి షాదీఖానా కోసం ఇచ్చారు. షాదీఖానా నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే యామినీబాల రూ. 35 లక్షలు నిధులు మంజురు చేయించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 95 శాతం పూర్తయింది.


2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే షాదీఖానా భవన నిర్మాణం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో 5 శాతం పనులు పూర్తి చేయకపోవడంతో ముస్లింలు మండిపడుతున్నారు. షాదీఖానా పనులు పూర్తి చేయకుండా ముస్లింలపై చిన్నచూపు చూస్తున్నారని ఆ వర్గానికి చెందిన పలువురు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీలపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ముస్లింలకు వైసీపీ మెండిచేయి చూపింది అనేందుకు కల్లూరులోని షాదీఖానానే నిలువెత్తు నిదర్శనమన్నారు. ముస్లింలపై జగనరెడ్డి కపట ప్రేమను కురిపిస్తున్నరని ఆరోపిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - May 04 , 2024 | 12:02 AM