Share News

POLL : పారదర్శకంగా పోలింగ్‌కు ఏర్పాట్లు

ABN , Publish Date - May 12 , 2024 | 11:58 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగనున్న పోలింగ్‌ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు, సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్‌ తెలిపారు. పట్టణంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పో లింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు అందించా రు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్‌లలో 253 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 192 కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌కు ఏర్పాటుకు రూపుదిద్దుకుంది.

POLL : పారదర్శకంగా పోలింగ్‌కు ఏర్పాట్లు

పురంలో 192 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌

హిందూపురం అర్బన, మే 12: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగనున్న పోలింగ్‌ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు, సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్‌ తెలిపారు. పట్టణంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పో లింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు అందించా రు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్‌లలో 253 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 192 కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌కు ఏర్పాటుకు రూపుదిద్దుకుంది. ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికా రులు అన్ని చర్యలు చేపట్టారు.


ఈ మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుని సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. మొత్తం 44 రూట్‌లలో 253 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. ఇందుకు గాను 253 మంది పోలింగ్‌ అధికారులు, 253 మంది అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు, 1012 మంది ఓపీఓలను నియమించారు. వారితో పాటు ప్రతి కేంద్రానికి పోలీస్‌ సిబ్బంది అదనంగా ఎన్నికల సిబ్బందికి ప్రొటెక్షనగా వెళ్లారు. సిబ్బందికి, ఓటర్లకు ఎటువం టి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పో లీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి అందించారు. ఎన్నిల విధులకు హాజరయ్యే సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 11:58 PM