ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemulawada Bhimalingeswara Swamy: వేములవాడ భీమలింగేశ్వరస్వామి

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:33 PM

మండలంలోని గడేకల్లు గ్రామంలో వెలసిన వేములవాడ భీమలింగేశ్వరస్వామి మహా రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం స్వామికి ప్రీతి పాత్రమైన మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లరుజామున ఉత్సాయంను ఆలయం వద్ద నుంచి గ్రామ చావడి వరకూ లాగారు. సాయంత్రం నిర్వహించిన మహా రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు, బళ్లారి, అనంతపురం, బెంగళూరు, వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ..

Devotees pulling the great chariot of Swami

వైభవంగా స్వామివారి రథోత్సవం

విడపనకల్లు, జూలై 23: మండలంలోని గడేకల్లు గ్రామంలో వెలసిన వేములవాడ భీమలింగేశ్వరస్వామి మహా రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం స్వామికి ప్రీతి పాత్రమైన మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లరుజామున ఉత్సాయంను ఆలయం వద్ద నుంచి గ్రామ చావడి వరకూ లాగారు. సాయంత్రం నిర్వహించిన మహా రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు, బళ్లారి, అనంతపురం, బెంగళూరు, వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.


గడేకల్లు గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల్లో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాయంత్రం భీమలింగేశ్వరస్వామి ఉత్సవమూర్తిని మేళతాళాల తో ఊరేగింపుగా తీసుకు వచ్చి ఆలయం ఎదుట మంటపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహారథంలో కొలువు దీర్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని ఆలయం నుంచి గ్రామంలోని బొడ్రాయి వరకూ లాగారు. తిరిగి ఆలయం వద్దకు రథం రావటంతో వేడుకలు ముగిశాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 23 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<