Book రామబ్రహ్మం రచనలు.. సామాజిక దర్పణాలు..
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:33 PM
పట్టణానికి చెందిన శాస్త్రవేత్త రామబ్రహ్మం రచనలు అన్నివర్గాల వారికి ఉపయోగపడే సామాజిక దర్పణాలని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం రాత్రి స్థానిక వాసవీ కల్యాణమండపంలో రామబ్రహ్మం రచించిన ‘రామా వినవేమిరా’, ‘భక్తి సుధా’ పుస్తకాల ఆవిష్కరణ సభ నిర్వహించారు.
పుస్తకావిష్కరణలో వక్తలు
పెనుకొండ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన శాస్త్రవేత్త రామబ్రహ్మం రచనలు అన్నివర్గాల వారికి ఉపయోగపడే సామాజిక దర్పణాలని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం రాత్రి స్థానిక వాసవీ కల్యాణమండపంలో రామబ్రహ్మం రచించిన ‘రామా వినవేమిరా’, ‘భక్తి సుధా’ పుస్తకాల ఆవిష్కరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కేయూ తెలుగు శాఖాధిపతి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం రామా వినవేమిరా పుస్తకాన్ని ఆవిష్కరించగా.. కవి ఏలూరి యంగన్న సమీక్షించారు. భక్తి సుధా పుస్తకాన్ని ఆశావాది శశాంకమౌళి ఆవిష్కరించగా.. విన్నకోట విజయసాగర్ సమీక్షించారు. వక్తలు మాట్లాడుతూ.. రామబ్రహ్మం రచించిన ఈ పుస్తకాల్లో సమాజానికి ఉపయోగపడే విషయాలున్నాయన్నారు. ప్రస్తుతం సాగుతున్న అవినీతి, అరాచకాలను ఎండగట్టారన్నారు. వాటికి దూరంగా ఉన్నతంగా ఎలా ఎదగాలి, గొప్పగా ఎలా రాణించాలి తదితర విషయాలను వివరించారన్నారు. భక్తి సుధా గ్రంధంలో భక్తి కులమతాలకు అతీతంగా ఉండాలనీ, అందరికీ దేవుడు ఒక్కడేనని తదితర విషయాలను వివరించారన్నారు. అనంతరం గ్రంధాన్ని వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌బాషా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగరాజు, సుధాకర్ గుప్తా, కోగిర జయచంద్ర పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 11:33 PM