BPT బీటీపీకి శాశ్వత పరిష్కారం
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:08 AM
భైరవానతిప్ప ప్రాజెక్టుకు ఐదేళ్లలో శాశ్వత పరిష్కారం చూపి, రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బీటీపీ కమిటీ ఎన్నికలకు శనివారం ఆయన హాజరయ్యారు. ప్రాజెక్టు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కలుగోడుకు చెందిన కాలవ నాగరాజు, ఉపాధ్యక్షుడిగా బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన సుభానను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
గుమ్మఘట్ట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): భైరవానతిప్ప ప్రాజెక్టుకు ఐదేళ్లలో శాశ్వత పరిష్కారం చూపి, రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బీటీపీ కమిటీ ఎన్నికలకు శనివారం ఆయన హాజరయ్యారు. ప్రాజెక్టు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కలుగోడుకు చెందిన కాలవ నాగరాజు, ఉపాధ్యక్షుడిగా బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన సుభానను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రైతులకు మోసం చేసిందని విమర్శించారు. బీటీపీ కోసం సీఎం చంద్రబాబు రూ.968 కోట్లు మంజూరు చేస్తే వైసీపీ నాయకులు రూ.150 కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. అభివృద్ధి పనులను అర్ధంతరంగా ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పూర్తికి చర్యలు చేపట్టారని అన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, తాను పలుమార్లు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లి నిధులను సాధించామని అన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాలువల మరమ్మతులు, ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు రూ.1.64 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. కుడికాలువ మరమ్మతులకు రూ.26.5 లక్షలు, ఎడమ కాలువ మరమ్మతులకు రూ.66 లక్షలు, విద్యుత సరఫరా, గేట్ల ఆధునికీకరణ తదితర పనులకు రూ.71.63 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గుమ్మఘట్ట మండల కన్వీనర్ గిరిమల్లప్ప, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు, క్లస్టర్ ఇనచార్జి కాలవ సన్నన్న, జనసేన ఇనచార్జి మంజునాథ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:08 AM