PARENTS MEETING: పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి
ABN, Publish Date - Dec 08 , 2024 | 12:18 AM
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచిమార్గంలో నడిపించాలని 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు, పాఠశాల హెచఎం నాగప్ప అన్నారు.
పండుగ వాతావరణంలో బడిలో వేడుకలు
ధర్మవరం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచిమార్గంలో నడిపించాలని 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు, పాఠశాల హెచఎం నాగప్ప అన్నారు. పట్టణంలో అన్ని ప్రభుత్వ ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాద్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంలో శనివారం నిర్వహించారు. అనంతరం ఆటలపోటీలు, ముగ్గులపోటీలు నిర్వహించారు.
కదిరి అర్బన: మండలంలోని పట్నం జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో శనివారం తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హెచఎం ల క్ష్మీదేవి, స్కూల్ కమిటీ అధ్యక్షులు వీర ప్రకాష్ మాట్లాడుతూ అందరికి విద్య మన బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఈకార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నడం సంతోషమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులుపాల్గొన్నారు.
తాడిమర్రి: తల్లిదండ్రులు వారిపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎంసీ చైర్‌పర్సన క్రిష్ణవేణి, ఎంఈఓలు క్రిష్ణమోహన, వెంకటేశ్వర్లు సూచించా రు. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శనివారం స్థానిక ఉన్నతపాఠశాల ఆవరణంలో నిర్వహించారు. సర్పంచ బాలమ్మ, హెచఎం అరుణ పాల్గొన్నారు.
తనకల్లు: విద్యార్థుల తల్లిదండ్రులు ఒక అడుగు పాఠశాల వైపు వేయాలని వక్తలు కోరారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో మేగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, ఎంఈఓలు లలితమ్మ, కళ్యాణి, ఎస్‌ఐ గోపి, డాక్టర్ లోకేశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఖాదర్‌వలీ, టీడీపీ మండల కన్వీనర్ తొట్లిరెడ్డిశేఖర్ పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: కలిసికట్టుగా మత్తు రహిత సమాజాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాలొ ్గని మాట్లాడారు. మత్తు పదార్ధాలపై అవగాహన కల్పించారు. మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, ఎంఈఓ సురే్‌షబాబు, హెచఎం శోభారాణి పాల్గొన్నారు.
బుక్కపట్నం: పిల్లలకు మంచి చదువు రావాలంటే ఉపాధ్యాయులకంటే ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంఈఓ గోపాల్‌నాయక్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల పాఠశాలతోపాటు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. మాజీ సర్పంచ సాకే యశోద, మైనార్టీ సయ్యద్‌బాషా, గోపాలపురం గంగాధర్ పాల్గొన్నారు.
బత్తలపల్లి: మండలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం పేరెన్స డే కార్యక్రమాన్ని నిర్వహిచారు.ఈ సందర్బంగా విద్యార్థుల అబివృద్ది కోసం తల్లిదండ్రులతో చర్చించి సలహలు చూచనలు చేశారు.విద్యాలు పాఠశాల నుంచి ఇల్లకు వచ్చిన తరువాత తల్లిదండ్రు ప్రత్యేకయ శ్రద్ద తీసుకోవాలన్నరు.సిఐ ప్రభాకర్ కస్తురిభా గాందీ బాలికల పాఠశాలలో పాల్గొని తల్లిదండ్రలకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు.
ముదిగుబ్బ: మత్తు పదార్థాలకు బానిస కావద్దని సీఐ శివరాముడు సూచించారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతోఏర్పాటుచేసిన సమావేశం నిర్వహించారు.
గాండ్లపెంట: మండలవా ్యప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పలు పాఠశాలలో తల్లిదండ్రులు, విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. అలాగే స్థానిక కస్తూరిబా పాఠశాలకు, గాండ్లపెంట ఉన్న పాఠశాలకు సీఐ నాగేంద్ర హాజరైయ్యారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో హెచఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ ఛైర్మన్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 08 , 2024 | 12:18 AM