ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector ప్రతి ఫిర్యాదూ పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:37 PM

ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అఽధికారులను కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 246 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్‌ స్వీకరించారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ టీఎస్‌ చేతన

కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తి టౌన, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అఽధికారులను కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 246 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్‌ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వ్యయప్రసాలకు ఓర్చి జిల్లాకేంద్రానికి వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారనీ, వాటిని క్షుణంగా పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. పరిష్కరించలేని సమస్యను ఫిర్యాదుదారుడికి అర్థమయ్యలా వివరించి, వారిని సంతృప్తి పరచాలన్నారనను. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌, డీఆర్వో విజయసారధి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీఎ్‌సఓ వంశీకృష్ణారెడ్డి, జిల్లా సహకార అధికారి కృష్ణానాయక్‌ పాల్గొన్నారు.

డీపీఓలో..

జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ రత్న అర్జీలు స్వీకరించారు. 50 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:37 PM