YADIKI OFFICERS: 5న రండి..!
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:39 PM
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల మాయంపై సంబంధిత అధికారులు ఈనెల 5న జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావాలంటూ సీఈఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ అధికారులు తమవద్ద ఉన్న ఆధారాలతో జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు.
జడ్పీ సీఈఓ కార్యాలయానికి రావాలని ఆదేశం
రికార్డుల మాయం నివేదికపై విచారణ
యాడికి, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల మాయంపై సంబంధిత అధికారులు ఈనెల 5న జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావాలంటూ సీఈఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ అధికారులు తమవద్ద ఉన్న ఆధారాలతో జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు. 2019-20 నుంచి 2022-23 కాల వ్యవధికి సంబంధించి యాడికి మండల పరిషత నిధుల్లో సీనరేజస్ సెస్ కోట్ల రూపాయల్లో జమ అయ్యిందని, ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారని, పనులపై విచారణ చేయాల్సిందిగా గతంలో కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అధికారిగా గుంతకల్లు డీఎల్‌డీఓను నియమించారు. ఆ అధికారి అక్టోబరు నెలలో యాడికి ఎంపీడీఓ కార్యాలయానికి విచారించారు. ఈ విచారణకు గతంలో పనిచేసిన ఎంపీడీఓ కొండయ్య, ఈఓపీఆర్‌డీ వెంకటేష్, పీఆర్ ఏఈలు వరప్రసాద్, ఆదినారాయణరెడ్డి, ఆంజనేయులు, దేవకుమార్ హాజరయ్యారు. మరికొందరు గైర్హాజరయ్యారు. సాధారణ నిధులకు సంబంధించిన రికార్డులు, క్యాష్‌బుక్స్, వోచర్స్, వర్క్‌లిస్ట్స్, మండలపరిషతలో ఆమోదించిన తీర్మానాలు విచారణ సమయంలో ఇవ్వలేదు. 2019-2020లో సాధారణ నిధులకు సంబంధించిన క్యాష్‌బుక్ మాత్రమే విచారణలో చూపించినట్లు తెలిసింది. 2019-2023కు సంబంధించి రికార్డులు ఇవ్వలేదు. 2019-2023 మధ్యకాలంలో రూ.3,54,23,290 సీఎ్‌ఫఎంఎస్ ద్వారా ట్రాన్సక్షన జరిపినట్లు విచారణలో తేల్చారు. ఈఎండీ ద్వారా 2021 జూన9న బి. రామచంద్రారెడ్డికి రూ.50వేలు, 19-06-2021న రూ.2.50లక్షలు సెల్ఫ్‌గా అదే ఏడాది జూలై 9న రూ.1.40లక్షలు, 20-01-2022న రూ.7వేలు, 19-06-2024న రూ.26వేలు డ్రా చేసుకున్నట్లు బ్యాంక్‌స్టేట్‌మెంట్‌లో గుర్తించారు. ఈఎండీ అమౌంట్‌ను కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు కాంట్రాక్టర్‌కు ఇవ్వవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన రికార్డులు కూడా ఎంపీడీఓ కార్యాలయంలో లేవని తెలిపారు. రికార్డులు అందించడానికి 15రోజులు సమయం ఇచ్చినా అధికారులు ఇవ్వలేకపోయారని నివేదికలో తెలిపారు. రికార్డు లు లేనందున పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం, విచారణకు రికార్డులు అందించలేని సంబంధిత అధికారులపై సీసీఏ రూల్స్‌మేరకు చర్యలు తీసుకోవాలని డీఎల్‌డీఓ విజయలక్ష్మి జడ్పీ సీఈఓకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అప్పటి ఎంపీడీఓ కొండయ్య, ఈఓపీఆర్‌డీ వెంకటే్‌షలను ఈనెల 5న జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశిస్తూ సీఈఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
అసలైన వారిని తప్పిస్తున్నారా?
2019-2023 మధ్యకాలంలో ఇనచార్జ్ ఎంపీడీఓగా పనిచేసిన అధికారిని వదిలేసి ఎవరినో బాధ్యులను చేస్తూ విచారణకు హాజరుకావాలంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వినవస్తున్నాయి. అప్పట్లో రెగ్యులర్ ఎంపీడీఓ ఉన్నప్పటికి ఇనచార్జ్ ఎంపీడీఓగా పెత్తనం చెలాయించిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ ఎంపీడీఓగా ఉన్న కొండయ్య వేతనాన్ని కూడా సీఎ్‌ఫఎంఎ్‌సలో ఇనచార్జ్ ఎంపీడీఓగా ఉన్న అనిల్‌కుమార్ మంజూరు చేయడం తెలిసిందే. రికార్డులు, ఎం. బుక్కులు చూపించాల్సిన ఆ అధికారి విచారణకు హాజరుకాలేదు. రికార్డులు అప్పగించని వైనంపై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి గుంతకల్లు డీఎల్‌డీఓ జిల్లా పరిషత సీఈఓకు నివేదిక ఇచ్చారు. అయితే ఆ అధికారిని విచారణకు పిలవకుండా ఇతర అధికారులను పిలవడంలో ఆంతర్యమేమిటో అని మండల పరిషత ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రికార్డులు మాయం చేసిన ఆ అధికారి ఒక ప్రజాప్రతినిధి సిఫార్సు ద్వారా చర్యలు తీసుకోకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం.
Updated Date - Dec 02 , 2024 | 11:39 PM