ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EC : మాస్టార్ల మీటింగ్‌పై ఫిర్యాదు?

ABN, Publish Date - May 11 , 2024 | 12:40 AM

ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్‌ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ...

అనంతపురం విద్య, మే 10: ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్‌ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని నాయకులు, హెచఎం వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొందరిని కాపాడేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేస్తున్నట్తు సమాచారం.


26న కలుసుకున్నారా..?

అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌కు గత నెల 26న ఏపీటీఎఫ్‌ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లారు. జిల్లా కౌన్సిల్‌ సమావేశం నెపంతో ఉద్యోగులు, సంఘాల నాయకులు ఒకచోట సమావేశం కావడంతో ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని సి-విజిల్‌ యాప్‌, ఇతర రూపాల్లో ఎన్నికల సంఘానికి కొందరు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలతో విచారించాలని కలెక్టర్‌ నుంచి డీఈఓకు మూడు రోజుల కిందటే ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డీఈఓ వరలక్ష్మి రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు రామాంజులును ఆఫీ్‌సకు పిలిపించి, విచారించాని సమాచారం. సమావేశం


నిర్వహణపై హెచఎం ద్వారా లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు కులశేఖర్‌రెడ్డి, జిల్లా నాయకుడు శ్రీనివాసులు రెడ్డిపై సి-విజిల్‌లో ఫిర్యాదులు వెళ్లడంతో వారిని కూడా డీఈఓ విచారణకు పిలిచినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖాధికారులకు కులశేఖర్‌రెడ్డి సంజాయిషీ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

కాపాడేందుకు ప్రయత్నాలు

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సమావేశంలో పాల్గొన్న కొందరిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమావేశంలో పాల్గొన్నవారి ఫొటోలు, వీడియోలను కొందరు ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి సమావేశం వీడియో, ఫొటోలు తీసినట్లు చర్చ సాగుతోంది. అయితే అక్కడ సమావేశం జరగలేదని డీఈఓకు స్కూల్‌ హెచఎం సంజాయిషీ ఇచ్చారని తెలిసింది. ఒక నాయకుడు సైతం ఇదే తరహాలో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు డీఈఓ ఎలాంటి నివేదిక ఇస్తారోనన్న చర్చ సాగుతోంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 11 , 2024 | 01:05 AM

Advertising
Advertising