ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education : సమగ్ర శిక్ష

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:52 AM

విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి ...

Comprehensive Punishment Project Office

కీలక పోస్టులన్నీ ఖాళీ

భర్తీ కోసం నెల క్రితం ఇంటర్వ్యూలు

ఫైల్‌ను అటకెక్కించిన అధికారులు

ఉన్నవారిపై పని భారం.. ఒత్తిడి

అనంతపురం విద్య, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. పరిశీలించారు. అనంతరం ఇంటర్య్వూలు చేశారు. కానీ ఇంత వరకూ భర్తీ చేయలేదు. దీంతో ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నవారు ఇస్తారా.. ఇవ్వరా అనే అయోమయం పడ్డారు. ఉన్నవారు వెళ్లిపోవడం, కొత్తవారు రాకపోవడంతో ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయి. మిగిలినవారిపై


పనిభారం, తీవ్ర ఒత్తిడి పడుతోంది. నిర్ణయం తీసుకోవాల్సిన కలెక్టరేట్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ఏం జరుగుతోంది..?

సమగ్ర శిక్ష ప్రాజెక్టులో సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారుల ఎంపిక కోసం అక్టోబరు 1న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఖాళీ పోస్టులకు సుమారు 35 మంది దరఖాస్తు చేశారు. వివిధ పోస్టులకు వీరి నుంచి 110కిపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులలో 14 మందిని ఇంటర్వ్యూకు పిలవగా 13 మంది హాజరయ్యారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, ఏసీపీ నాగరాజు, డైట్‌ ప్రిన్సిపాల్‌ రవిసాగర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ తంతు ముగిసి నెల గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని రోజులపాటు ఏం చేస్తున్నారో అని ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఉన్నతాధికారులు సైతం దీనిపై నోరుమెదపడం లేదు. ఎమ్మెల్యేలు, రాజకీయ పెద్దల ప్రమేయంతో బ్రేక్‌ పడిందా...? లేక వేరే కారణాలున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

మూడు నెలలుగా తిప్పలు

సమగ్ర శిక్షలో మూడు నెలలుగా అధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులైన ఏఎంఓ, జీసీడీఓ, ఇద్దరు అసిస్టెంట్‌ ఏఎంఓలు, అసిస్టెంట్‌ సీఎంఓ, అసిస్టెంట్‌ అలెస్కో, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఐఈడీని విద్యాశాఖకు రీ ప్యాట్రియేషన చేశారు. ఈ పోస్టులన్నీ అత్యంత కీలకమైనవి. రీప్యాట్రియేషన చేసినవారిలో ఇద్దరిని మాత్రం కొత్తవారు వచ్చే వరకూ ప్రాజెక్టులోనే ఉంచుకుని, తాత్కాలికంగా పని చేయించుకుంటున్నారు. మిగిలినవారిని పంపించేశారు. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో సమగ్రశిక్షలో పాలన కుంటుపడుతోంది. ఒక వైపు ఎఫ్‌ఎల్‌ఎన శిక్షణలు జరుగుతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే టీచర్లకు ఇస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాలను, ఏర్పాట్లను సమగ్రశిక్ష అధికారులే పర్యవేక్షించాలి. మరోవైపు కేజీబీవీల పోస్టుల భర్తీ సైతం కొనసాగుతోంది. రొటీన వర్కులకు అదనంగా ఈ పనులు ఉండటంతో ప్రాజెక్టు ఉద్యోగులపై భారం పడుతోంది. ప్రాజెక్టు ఉన్నతాధికారులతోపాటు సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:52 AM