Junior doctors : ఆగని నిరసన
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:13 AM
కోల్‌కతా బోధనాస్పత్రిలో పీజీ డాక్టర్ హత్యాచార ఘటనపై అనంతలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వందలాదిమంది డాక్టర్లు, మెడికోలు, జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు భద్రత కల్పించి న్యాయం చేయండి. డాక్టర్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి అంటూ నినదించారు. కలెక్టరేట్ ...
కోల్‌కతా ఘటనపై కఠిన చర్యలు తీసుకోండి
జూడాల డిమాండ్
అనంతపురం టౌన, ఆగస్టు 19: కోల్‌కతా బోధనాస్పత్రిలో పీజీ డాక్టర్ హత్యాచార ఘటనపై అనంతలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వందలాదిమంది డాక్టర్లు, మెడికోలు, జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు భద్రత కల్పించి న్యాయం చేయండి. డాక్టర్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి అంటూ నినదించారు. కలెక్టరేట్
ప్రధాన రోడ్డుపై మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారవేదికలో కలెక్టరు వినోద్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కలిసి డాక్టర్లకు భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 20 , 2024 | 12:13 AM