MLA DAGGUPATI : అవినీతి, నిర్లక్ష్యాన్ని సహించం: ఎమ్మెల్యే దగ్గుపాటి
ABN, Publish Date - Sep 24 , 2024 | 12:16 AM
గతంలో మాదిరిగా అవినీ తికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. అనంతపు రం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరై ప్రజల నుంచి అర్జీ లు స్వీకరించారు.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 23: గతంలో మాదిరిగా అవినీ తికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. అనంతపు రం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరై ప్రజల నుంచి అర్జీ లు స్వీకరించారు. కార్మికులకు పనిముట్లు ఇవ్వాలంటూ సీఐటీయూ నా యకులు నిరసన వ్యక్తం చేయగా... వెంటనే కార్మికులకు చీపుర్లు, ఇతర పనిము ట్లు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గత ప్రభుత్వంలో మునిముట్ల కోసం డ్రా చేసిన రూ.1.60 కోట్లు ఎక్కడికి పోయా యని అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. ప్రస్తుత పాలక వర్గం, మేయర్, మాజీ ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వ్యవస్థలన్నిటినీ నాశనం చేసిన జగన : ఎమ్మెల్యే
అనంతపురం అర్బన : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన వ్యవస్థలన్ని టినీ సర్వనాశనం చేశాడని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండి పడ్డారు. స్థానిక సాయినగర్‌లో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్ర మాన్ని నిర్వహించారు. నడిమి వంక, మరువ వంక సైడ్ వాల్స్, అండర్ డ్రైనేజీ, డంపింగ్ యార్డుల పనులు ప్రారంభిస్తామన్నారు. నగర కమిషనర్ నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు బుగ్గయ్య చౌదరి, సరిపూటి రమణ, నెట్టెం బాలకృష్ణ, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎం లక్ష్మీప్రసాద్, నారాయణస్వామి యాదవ్, సైఫుద్దీన, కడియాల కొండన్న, స్వప్న, పెండ్యాల శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: మండలంలోని రూరల్ పంచాయతీ పరిధిలోని భైరవ నగర్‌లో సోమవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 24 , 2024 | 12:16 AM