TADIPATRI : కౌంటింగ్ రోజు అష్టదిగ్బంధనం
ABN, Publish Date - May 24 , 2024 | 12:43 AM
జూన 4న ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున.. తాడిపత్రి పట్టణంలోకి అనుమానితులు, అల్లరిమూకలు ప్రవేశించకుండా అష్టదిగ్బంధనం చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. పట్టణ శివారులోని నందలపాడు, ఆటోనగర్, పెద్దపప్పూరు రోడ్డులోని చెక్‌పోస్టులను వారు గురువారం తనిఖీ చేశారు. కౌంటింగ్ రోజున పరిసర మండలాల నుంచి అల్లరిమూకలు తాడిపత్రిలోకి రాకుండా చూసుకోవాలని పోలీసులకు....
డీఐజీ షిమోషి, ఎస్పీ గౌతమి శాలి
తాడిపత్రి టౌన, మే 23: జూన 4న ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున.. తాడిపత్రి పట్టణంలోకి అనుమానితులు, అల్లరిమూకలు ప్రవేశించకుండా అష్టదిగ్బంధనం చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. పట్టణ శివారులోని నందలపాడు, ఆటోనగర్, పెద్దపప్పూరు రోడ్డులోని చెక్‌పోస్టులను వారు గురువారం తనిఖీ చేశారు. కౌంటింగ్ రోజున పరిసర మండలాల నుంచి అల్లరిమూకలు తాడిపత్రిలోకి రాకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక కాలనీల్లో పికెట్ కొనసాగించాలని
అన్నారు. ముఖ్యనాయకుల ఇళ్లు, వాటి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో 144 సెక్షన అమలులో ఉందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజు బాణసంచా పేల్చవద్దని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారి వెంట డీఎస్పీలు జనార్దననాయుడు, శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, సీఐ నాగేంద్రప్రసాద్ ఉన్నారు.
11 మంది అరెస్టు
తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడి కేసులో గురువారం 11 మందిని అరెస్టు చేశామని, తొమ్మిది మందిని బైండోవర్ చేశామని ఎస్‌ఐ గౌస్‌బాషా తెలిపారు. తాడిపత్రి పట్టణం, మండలంలోని గంగాదేవిపల్లి, వెంకటాంపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో
నిందితులను అరెస్టు చేసి, స్టేషనకు తరలించారు. బైండోవర్ చేసిన వారిని తహసీల్దార్ ఆంజనేయులు ఎదుట హాజరుపరిచి, పూచీకత్తుపై విడిచిపెట్టారు. అరెస్టు అయిన వారిలో లక్ష్మినారాయణ, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. వీరిని అనంతపురం కోర్టుకు తరలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 24 , 2024 | 12:44 AM