ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP ELECTIONS : రేపే కౌంటింగ్‌

ABN, Publish Date - Jun 03 , 2024 | 12:15 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన ప్రారంభమైంది. జిల్లాలో అనంతపురం పార్లమెంటుతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్‌ ప్రక్రియకు జేఎనటీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గత కొన్ని రోజులుగా కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ...

Collector Vinod Kumar examining the counting arrangements at JNTU

పార్లమెంటు, అసెంబ్లీల వారీగా ఏర్పాట్లు

ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

జిల్లాకు చేరుకున్న పరిశీలకులు

భద్రతావలయంలో జేఎనటీయూ

అనంతపురం టౌన, జూన 2:

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన ప్రారంభమైంది. జిల్లాలో అనంతపురం పార్లమెంటుతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్‌ ప్రక్రియకు జేఎనటీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గత కొన్ని రోజులుగా కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, అధికారులకు ఆదేశాలిస్తూ వస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక గదితో పాటు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్‌ చేయించనున్నారు.


జిల్లాకు చేరుకున్న పరిశీలకులు...

కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషన జిల్లాకు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులుగా మనీష్‌ సింగ్‌, ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులుగా అజయ్‌నాథ్‌, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌కుమార్‌లను నియమించారు. వీరు ఆదివారం జిల్లాకు చేరుకున్నారు.

భద్రతావలయంలో జేఎనటీయూ...

కౌంటింగ్‌ నిర్వహిస్తున్న జేఎనటీయూ ప్రాంతం పూర్తిగా భద్రతా వలయంలో ఉంది. కౌంటింగ్‌కు ఒకరోజు మాత్రమే ఉండటంతో ఆ ప్రాంతాన్ని స్పెషల్‌ పార్టీ పోలీస్‌ బృందాలు ప్రత్యేక నిఘాతో పరిశీలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ గౌతమీశాలి రాజీ లేకుండా భద్రతా చర్యలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 03 , 2024 | 12:15 AM

Advertising
Advertising