ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident : మృత్యు తాండవం

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:59 PM

రహదారులపై యమ కింకరులు మాటు వేసినట్లున్నారు. ఒకే రోజు నలుగురు ద్విచక్ర వాహనదారులను బలితీసుకున్నారు. పలువురిని తీవ్రంగా గాయపరిచారు. అనంతపురం, నంద్యాల జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వంకమిట్టపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిచెందారు, ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు యాడికి మండలం వేములపాడు గ్రామస్థులు. రెండు బైకులు ఢీకొనడంతో చాకలి రాజు(35) ...

A crowd gathered at the scene of the accident

మూడుచోట్ల ప్రమాదాలు

నలుగురు ద్విచక్ర వాహనదారులు బలి

13 మందికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు

యాడికి ఆస్పత్రిలో కనిపించని వైద్యులు

ఆగ్రహం వ్యక్తంచేసిన బాధిత కుటుంబాలు

పామిడి వద్ద జీపు ఢీకొని అన్నదమ్ముల మృతి

యాడికి/పామిడి/ఉరవకొండ, ఆగస్టు 29: రహదారులపై యమ కింకరులు మాటు వేసినట్లున్నారు. ఒకే రోజు నలుగురు ద్విచక్ర వాహనదారులను బలితీసుకున్నారు. పలువురిని తీవ్రంగా గాయపరిచారు. అనంతపురం, నంద్యాల జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వంకమిట్టపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిచెందారు, ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు యాడికి మండలం వేములపాడు గ్రామస్థులు. రెండు బైకులు ఢీకొనడంతో చాకలి రాజు(35)


మృతిచెందాడు. వేములపాడుకు చెందిన ఓ కుటుంబం అవుకు మండలం కంబగిరిస్వామి ఆలయం వద్ద శుభకార్యాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు వెళ్లిన గ్రామస్థులు చాకలి రాజు, సూరి, రాజు, నల్లన్న, ప్రసాద్‌ రెండు బైకుల మీద తిరిగి వస్తూ.. పరస్పరం ఢీకొన్నారు. చాకలి రాజు అక్కడికక్కడే మృతిచెందగా, సూరి, ప్రసాద్‌, రాజు తీవ్రంగా గాయపడ్డారు. నల్లన్న స్వల్పంగా గాయపడ్డాడు. బాధితులను ఆటోలో యాడికి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో గంటపాటు వేచి చూసి తాడిపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం వస్తే ఆస్పత్రిలో కనీసం నర్సు కూడా లేకపోవడం ఏమిటని బాధిత కుటుంబ సభ్యులు, వేములపాడు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో 108 వాహనం కూడా అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రమాదంలో మృతిచెందిన చాకలి రాజు లారీ డ్రైవర్‌. ఆయనకు భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.

కోనాపురం వద్ద..

ఉరవకొండ మండల పరిధిలోని కోనాపురం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో వీరేష్‌(26) అనే యువకుడు మృతి చెందాడు. బళ్లారిలోని రాయల్‌ నగర్‌కు చెందిన వీరేష్‌, గోవిందరాజు అనంతపురంలో స్నేహితుని వివాహం కోసం ద్విచక్రవాహనంలో బయలు దేరారు. కోనాపురం వద్ద ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ప్రైవేటు వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వీరేష్‌ మృతి చెందాడు. గోవిందరాజుకు ఉరవకొండ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నదమ్ములు బలి

పామిడి పట్టణంలోని చైతన్య కాలనీ వద్ద బైకును తుఫాన వాహనం ఢీకొట్టడంతో అన్నదమ్ములు చిన్నబాబు(28), సాయి(26) మృతిచెందారు. గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన చాగంటి మోహన, రామాంజినమ్మ దంపతుల కుమారులు వీరు. ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. పామిడిలో ఓ శుభకార్యం కవరేజ్‌ కోసం బైక్‌లో వస్తుండగా ఎదురుగా వస్తున్న తుఫాన వాహనం కుక్కను తప్పించబోయి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ 108లో పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు పామిడిలో మరొకరు అనంతపురంలో మృతిచెందాడు. తుఫాను వాహనం మధ్యప్రదేశ రాషా్ట్రనికి చెందినది. డియోరీ జిల్లాకు చెందిన పలువురు కేరళలోని ఇడుక్కి జిల్లాకు కూలి పనులకు ఈ వాహనంలో బయలుదేరారు. బైనును ఢీకొట్టిన తుఫాను వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న చమన, నిర్మల్‌ సింగ్‌, అభత కుమార్‌, పూల్‌ చంద్‌, ప్రేమ్‌ సింగ్‌, కిర్రపాల్‌, అజ్మీర్‌సింగ్‌, తిలక్‌, పుష్మేంధర్‌ గాయపడ్డారు. వీరిని 108, హైవే అంబులెన్సలలో వివిధ ఆసుపత్రులకు తరలించారు. చాగంటి సాయి పామిడి ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందగా, చాగంటి చిన్నబాబు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యప్రదేశకు చెందిన చమన పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన కుక్క మృత్యువాత పడింది.

మిన్నంటిన రోదనలు

అన్నదమ్ముల మృతి విషయం తెలుసుకున్న కల్లూరు వాసులు పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి పెద్దఎత్తున తరలివచ్చారు. సాయి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. సాయికి భార్య ప్రశాంతి, కుమారుడు రోహిత కుమార్‌, కూతురు శ్రేష్ఠకుమారి ఉన్నారు. చిన్నబాబుకు భార్య ఉన్నారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2024 | 11:59 PM

Advertising
Advertising