CPI JAGADISH: అప్పటి డిమాండ్లు.. ఇప్పుడు నెరవేర్చండి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:41 PM
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వివిధ డిమాండ్లతో ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్నందు న వాటన్నింటిని నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ డిమాండ్ చేశారు.
గుంతకల్లు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వివిధ డిమాండ్లతో ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్నందు న వాటన్నింటిని నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన విలేకఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రజాహిత పరిపాలనను తాము స్వాగతిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలు పాత పథకాలు, పాత ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతుందన్న నమ్మకంతో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ, హంద్రీనీవా వైడెనింగ్, రాగులపాడు లిఫ్టు, డ్రిప్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందన్నారు. వాటన్నింటినీ పూర్తిచేసి, ఆశించిన మేరకు సాగునీరు అందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని గుర్తు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో నాలెడ్జి హబ్‌ను సాకారం చేయాలన్నారు. చార్జీలను పెంచడానికి విద్యుత శాఖ సమాయత్తమౌతోందని, కరెంటు చార్జీలను పెంచరాదన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందజేయాలన్నారు. సమావేశంలో గోవిందు, వీరభద్రస్వామి, మహమ్మద్ గౌస్, మహేశ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:41 PM