Share News

BK : అభివృద్ధి సాధకుడు చంద్రబాబు: బీకే

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:05 AM

అభివృద్ధిలో చంద్రబాబుకు, జగనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి విమ ర్శించారు. చంద్రబాబు అభివృద్ధి సా ధకుడని, జగన నిరోధకుడ న్నారు. ఆయన ఆదివారం మండలంలోని గొందిపల్లిలో కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్‌ పథ కాలను వివరించారు.

BK : అభివృద్ధి సాధకుడు చంద్రబాబు: బీకే
BK speaking in Gondipalli campaign

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 28 : అభివృద్ధిలో చంద్రబాబుకు, జగనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి విమ ర్శించారు. చంద్రబాబు అభివృద్ధి సా ధకుడని, జగన నిరోధకుడ న్నారు. ఆయన ఆదివారం మండలంలోని గొందిపల్లిలో కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్‌ పథ కాలను వివరించారు. అనంతరం బీకే మాట్లాడుతూ... వెనుకబడిన రాయలసీమకు గొల్లపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటుచేసి, కియ పరిశ్ర మ ను తెచ్చి ఎంతో మందికి ఉపాధి చూపిన ఘనత చంద్రబాబుది అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన కియ వద్దకు వచ్చి తమ ప్రభుత్వం రాగానే రైతుల భూములు తిరిగి ఇప్పి స్తామ న్నారన్నారు. అభివృద్ధికి వ్యతిరేకి జగనకు ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పాలన్నారు. టీడీపీ నాయకులు గుట్టూరు చిన్న వెంకటరాముడు, లక్ష్మీనారాయణరెడ్డి, రఘువీరాచౌదరి, సూర్య నారాయణరెడ్డి, సర్పంచ శ్రీనివాసులు, కురుబ కృష్ణమూర్తి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


పెనుకొండ: జగన అరాచక పాలనలో రాష్ట్రం అభివృద్ధి విషయంలో దేశంలోనే వెనుకబడిందని, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే మార్గమని హిందూపురం పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడితే.... వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమాన్ని మరిచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:05 AM