ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : అభివృద్ధి పరుగులు..!

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:40 PM

గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.... గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది... అని నిత్యం ప్రజాప్రతినిధులు చేప్పేమాటలు. వాటిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచింది. ఎన్నికల ముం దు హడావుడిగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చింది అంతంత మాత్రమే.

జోరుగా సీసీరోడ్ల నిర్మాణం

మండల వ్యాప్తంగా రూ. 5కోట్లతో పనులు

అనంతపురం రూరల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.... గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది... అని నిత్యం ప్రజాప్రతినిధులు చేప్పేమాటలు. వాటిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచింది. ఎన్నికల ముం దు హడావుడిగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చింది అంతంత మాత్రమే. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామాభివృద్ధి కి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఐదేళ్లగా మరుగున పడిన సీసీరోడ్లకు మోక్షం కలిగింస్తోంది. ఈక్రమంలో మండల వ్యాప్తంగా దాదాపు5.14కోట్లతో పనులు జోరుగా సాగుతున్నాయి.

జోరుగా సీసీ రోడ్ల నిర్మాణం

రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని అనంతురం రూరల్‌ మండలంలో 21గ్రాయ పంచాయతీలున్నాయి. ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని పంచాయతీల్లో నెల రోజుల కిందట సీసీరోడ్ల నిర్మాణానికి రూ.5.14 కోట్ల్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో అత్యధి కంగా పాపంపేట పంచాయుతీలో 22 సీసీరోడ్లకు రూ.1.39 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇటుకల పల్లి, చియ్యేడు గ్రామాల్లో రూ.15 లక్షలు చొప్పున, ఆల మూరు రూ.20 లక్షలు, కక్కలపల్లి కాలనీ రూ.43 లక్షలు, కక్కలపల్లి రూ.17 లక్షలతో పనులు జరుగుతు న్నాయి. కందుకూరు పంచాయతీ పరిధిలోని కందు కూరు, కృష్ణంరెడ్డిపల్లిలో రూ.60 లక్షలు, కామరుపల్లిలో రూ.10 లక్షలు, పూలకుంటలో రూ.10 లక్షలు, రాచానపల్లి పంచాయతీలోని రాచానపల్లి, సిండికేట్‌నగర్‌లో రూ. 32 లక్షలు, సోములదొడ్డి పంచాయతీ పరిధిలోని సోములదొడ్డి, పామురాయి గ్రామాల్లో రూ.31 లక్షలతో పనులు సాగుతున్నాయి.


అదేవిధంగా కురుగుంటలో రూ.30 లక్షలు, కాటిగాని కాలువలో రూ.12 లక్షలు, తాటిచెర్ల లో రూ.20లక్షలు, ఉప్పరపల్లిలో రూ.10 లక్షలు, మన్నీలలో రూ.10 లక్షలు చొప్పున సీసీరోడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఇందులో ఇప్పటికే పాపంపేట, ఆలమూరు, కందుకూ రు, తాటిచెర్ల, కామారుపల్లి, కక్కలపల్లి కాలనీ, కురు గుంట తదితర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు జరుగు తున్నాయి. కొన్ని పూర్తై, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిక చిహ్నాలుగా నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం - పామురాయి రఘు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి

తెలుగుదేశం పార్టీతోనే అభివృ ద్ధి, సంక్షేమం సాధ్యం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆ మేరకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు పనుల ప్రారంభించాం. గ్రామాల్లో జరుగుతున్న పనులు ఇందుకు నిదర్శనం. సంక్షేమ కార్యక్రమాల అమలులోను కూటమి ప్రభుత్వం ఇదే రీతిలో ముం దుకు సాగుతోంది.

అప్పుడు గ్రామాలను గాలికొదిలేశారు - రాగే మురళీ , టీడీపీ క్టస్టర్‌ ఇనచార్జ్‌, ఆకుతోటపల్లి

గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల ను గాలికొదిలే శారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించా రు. దీంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. ముఖ్యంగా రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉండేది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత తన ప్రచారంలో రోడ్ల సమస్య పరిష్కరి సా ్తమని హామీ ఇచ్చారు. ఆ మేరకు మొదటి ప్రాధా న్యం గా చాలా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణా లు చేపట్టాం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 17 , 2024 | 11:40 PM