ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TAMOTA MANDI : పంచాయతీకి పైసలు చేదా?

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:14 AM

వ్యాపారం చేయాలంటే నిబంధనలు పాటించాలి. చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలి. కానీ రూ.కోట్ల లావాదేవీలు జరిగే కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో ఇవేవీ అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టమోటా మార్కెట్‌ నిర్వహణకు మార్కెటింగ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స పొందాలి. 2019లో పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ప్రభుత్వం సెస్‌ మినహాయించింది. దీంతో మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారులు టమోటా మార్కెట్‌ గురించి పట్టించుకోవడం మానేశారు. సెసె మినహాయింపు ఉన్నా.. మార్కెట్‌ నిర్వహణకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ నుంచి అనుమతులు ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కొందరికి గతంలో ట్రేడ్‌ లైసెన్స ఉన్నా.. 2019 తరువాత రెన్యువల్‌ చేయించలేదని

పన్ను వసూలు పట్టని అధికారులు..

ఖర్చులు మాత్రం తడిసి మోపెడు

తాగునీటి సౌకర్యానికే నెలకు రూ.లక్ష

ల్యాండ్‌ కన్వర్షన చేయకనే మార్కెట్‌ నిర్వహణ

రెవెన్యూ శాఖకూ మండీ నిర్వాహకుల టోపీ

ట్రేడ్‌ లైసెన్స లేదు.. ఉన్నవాటికి రెన్యువల్‌ లేదు

కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో తవ్వేకొద్దీ అవినీతి

అనంతపురం రూరల్‌, ఆగస్టు 24: వ్యాపారం చేయాలంటే నిబంధనలు పాటించాలి. చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలి. కానీ రూ.కోట్ల లావాదేవీలు జరిగే కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో ఇవేవీ అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టమోటా మార్కెట్‌ నిర్వహణకు మార్కెటింగ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స పొందాలి. 2019లో పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ప్రభుత్వం సెస్‌ మినహాయించింది. దీంతో మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారులు టమోటా మార్కెట్‌ గురించి పట్టించుకోవడం మానేశారు. సెసె మినహాయింపు ఉన్నా.. మార్కెట్‌ నిర్వహణకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ నుంచి అనుమతులు ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కొందరికి గతంలో ట్రేడ్‌ లైసెన్స ఉన్నా.. 2019 తరువాత రెన్యువల్‌ చేయించలేదని సమాచారం. ఇంత పెద్ద మార్కెట్‌.. అదీ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా.. ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ మార్కెట్‌ కావడంతో చాలామంది మండీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టమోటా ధరలు వారు అనుకున్న విధంగా పెరుగుతాయి.. తగ్గుతాయి. ఇదే క్రమంలో బెదిరింపులు.. అక్రమ వసూళ్ల యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రైతుల నుంచి నాలుగు శాతం కమీషన తీసుకోవాల్సి ఉండగా.. పదిశాతం దండుకుంటున్నారు. కలెక్టర్‌ దృష్టి సాధిస్తే తప్ప దోపిడీకి అడ్డుకట్ట పడటం సాధ్యం కాదని బాధితులు అంటున్నారు.


ల్యాండ్‌ కన్వర్షన ఏదీ..?

కక్కలపల్లి టమోటా మార్కెట్‌ సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మండీల నిర్వహకులు భూ యజమానుల వద్ద లీజుకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు. మార్కెట్‌ నిర్వహణ వాణిజ్యపరమైనది. కాబట్టి మార్కెట్‌కు వినియోగించే భూమిని కమర్షియల్‌ ల్యాండ్‌గా కన్వర్షన చేయించుకోవాలి. కానీ టమోటా మార్కెట్‌లో ల్యాండ్‌ కన్వర్షన చేయించిన ఆనవాళ్లు లేవు. రెవెన్యూ నిబంధనల ప్రకారం ల్యాండ్‌ కన్వర్షనకు భూమి విలువలో 5 శాతం పన్ను చెల్లించాలి. తద్వారా రెవెన్యూ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ ఆ శాఖకు ఆదాయం అవసరం లేదేమో.. పట్టించుకోవడం లేదు. మార్కెట్‌కు వినియోగిస్తున్న భూముల్లో ఎవరివి..? వ్యాపారులు వారికి ఎంత చెల్లిస్తున్నారు..? పంచాయతీకి పన్ను ఎంత చెల్లిస్తున్నారు..? ల్యాండ్‌ కన్వర్షన చేయించని కారణంగా రెవెన్యూ శాఖకు ఎంత నష్టం జరుగుతోంది..? ఈ లెక్కలను జిల్లా ఉన్నతాధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.

పంచాయతీకీ అంతంతే..

టమోటా మార్కెట్‌ నిర్వహణ కక్కలపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా పన్ను చెల్లించాలి. వ్యాపారం కాబట్టి.. కమర్షిల్‌ పన్ను చెల్లించాలి. మండీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, అందులో భవనాలు, తదితరాలను పరిగణనలోకి తీసుకుని పన్ను విధించాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. వాణిజ్య పన్ను వసూలు చేస్తే కక్కలపల్లి పంచాయతీకి వేలాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. కానీ వ్యాపారులు లైసెన ఫీజు పేరిట రూ.5వేలు, రూ.2వేలు కట్టి చేతులు దులుపుకుంటున్నారు. మార్కెట్‌లో 28 మండీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఈ మాత్రం పన్నైనా చెల్లిస్తున్నాయి. గత ఏడాది ఏ ఒక్క వ్యాపారీ పన్ను చెల్లించలేదని సమాచారం. రూ.80 వేలదాకా బకాయి ఉన్నట్లు సమాచారం.

పంచాయతీపై భారం

టమోటా మార్కెట్‌ ద్వారా కక్కలపల్లి పంచాయతీకి ఆదాయం సమకూరడం అటుంచి.. ఖర్చు తడిసి మోపడవుతోంది. మార్కెట్‌పై ఆధారపడ్డవారు పంచాయతీ పరిధిలో వందల మంది ఉన్నారు. వీరికి విద్యుత, మంచినీరు తదితర మౌలిక వసతులను పంచాయతీ కల్పిస్తోంది. ఒక్క నీటి వినియోగం కారణంగానే కరెంటు బిల్లుల వేలల్లో చెల్లిస్తోంది. పంచాయతీ పరిధిలో 15 బోర్లు ఉన్నాయి. ఇందులో మార్కెట్‌ పరిధిలోనే 9 ఉన్నాయి. కనీసం ఐదు బోరుబావుల నీటిని మార్కెట్‌ అవసరాలకు వాడుకుంటున్నారు. పదిహేను బోరుబావుల మోటార్లకు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు కరెంటు బిల్లుల రూపంలో పంచాయతీ చెల్లిస్తోంది. మార్కెట్‌ అవసరాలకు వాడుతున్న బోరుబావులకే నెలకు రూ.లక్ష దాకా వెచ్చిస్తోంది. మార్కెట్‌ కోసం పంచాయతీ ఖర్చు చేయడమే తప్ప.. మార్కెట్‌ నుంచి ఆదాయం రావడం లేదు. అయినా అధికారులకు పట్టడం లేదు. కక్కలపల్లి పంచాయతీకి ఉన్న అతిపెద్ద ఆదాయ వనరు టమోటా మార్కెట్‌. కానీ సద్వినియోగం చేసుకోవడం లేదు. ఏళ్ల తరబడి వాహనాల పన్ను, మండీల పన్ను వసూలు చేయకపోవడం విస్తుగొలుపుతోంది. పైగా, మార్కెట్‌లో ప్రైవేటు వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నా.. చేష్టలుడిగి చూస్తోంది.

టమోటా రైతులను ఆదుకోండి

ఇనచార్జి కలెక్టర్‌ శివనారాయణ శర్మ

అనంతపురం టౌన: టమోటా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఇనచార్జి కలెక్టర్‌ శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మార్కెఫెడ్‌ అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో టమోటా రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ఆరాతీశారు. ఒకేసారి పంట రావడంతో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని సూచించారు. వసతి గృహాలు, అంగనవాడీ కేంద్రాలు, రైతు బజార్లకు టమోటా సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో టమోటా ప్రాసెస్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యలపై..

భూసమస్యలపై ఆర్డీఓలు, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు అవగాహన పెంచుకోవాలని ఇనచార్జి కలెక్టర్‌ అన్నారు. వంశపారపర్యంగా వచ్యే భూ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలని ఆదేశించారు. లేదంటే సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. వర్క్‌షాపులలో అవగాహన కల్పిస్తామని, పాలనలో వినియోగించుకోవాలని సూచించారు. డీఆర్వో రామకృష్ణారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 25 , 2024 | 12:14 AM

Advertising
Advertising
<