MLA : బాధ్యత మరచిపోకండి
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:21 AM
ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు.
అనంతపురం రూరల్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు. నియోజకవర్గంలోని 27చెరువులు, ఐదు సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ఎకగ్రీవం కావడంపై ఎమ్మెల్యే, పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు సూచించిన విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగు నీరు అందిం చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో అంతా కలసి కట్టుగా ఉంటూ పంటలు సాగుచేసుకోవాలన్నారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
శింగనమల, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికైన కూటమి మద్దతుదాలకు ఎమ్మెల్యే శనివారం రాత్రి అభినందనలు తెలిపారు. శింగనమల ఆయక ట్టు అధ్యక్షుడు గార్లదిన్నె సత్యనారాయణ ఉపాధ్యక్షుడు పట్రా ఎర్రిస్వా మి, తరిమెల ఆయకట్టు అధ్యక్షుడు నిదనవాడ కుమ్మెత చండ్రాయుడు, ఉపాధ్యక్షుడు దండు లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు దండు శ్రీని వాసులు, నాగముని, విశ్వనాథరెడ్డి, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు ఎమ్మె ల్యేని నగరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. రైతుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 15 , 2024 | 01:21 AM