MLA SUNITA : మార్చిలోగా అన్ని గ్రామాలకు తాగునీరందాలి
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:21 AM
రాప్తాడు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వచ్చే మార్చిలో గా తాగునీరు అందేలా చర్యలు తీసుకో వాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆర్‌డబ్ల్యూఎస్, పర్యాటక శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిం చారు. రాప్తాడు నియోజకవర్గానికి తాగు నీటి అవసరాల కోసం పీఏబీఆర్ నుంచి అనంతపురం వరకు వేస్తున్న పైప్‌లైన పనులు మధ్యలోనే ఆగిపోవడంపై ఆరా తీశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం అర్బన, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాప్తాడు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వచ్చే మార్చిలో గా తాగునీరు అందేలా చర్యలు తీసుకో వాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆర్‌డబ్ల్యూఎస్, పర్యాటక శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిం చారు. రాప్తాడు నియోజకవర్గానికి తాగు నీటి అవసరాల కోసం పీఏబీఆర్ నుంచి అనంతపురం వరకు వేస్తున్న పైప్‌లైన పనులు మధ్యలోనే ఆగిపోవడంపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తామన్నారు. దీంతోపాటు దెబ్బతిన్న పైప్‌లైన్ల మరమ్మతులు, ఎక్కడైనా కొత్త లైన్లు వేయాల్సి ఉంటే ఆ పనులను చేపట్టాలన్నారు. గ్రామాల్లో అన్ని చోట్లా కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని, ఓవర్ హెడ్ ట్యాంక్‌లలో నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్త పల్లి మండలాల్లోని అన్ని గ్రామాలకు తాగునీటి అవ సరాల కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి సీపీ డబ్ల్యూఎస్ పథకం నిర్మాణానికి రూ.180 కోట్లు అవ సరమని అంచనా వేశామన్నారు. జాతీయ రహదారి పక్కన, పంపనూరు అటవీ ప్రాంతంలో పైప్‌లైన ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల అంశాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తా మని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. రామగిరి మం డలం వెంకటాపురంలో రూ.2.50 కోట్లతో తిరుమల దేవర స్వామి ఆలయంలో పర్యాటక సౌకర్యాలు, దుర్గాదేవి ఆలయానికి మెట్ల్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.50 లక్షలతో శివాలయాన్ని అభివృద్ది చేశామన్నా రు. ఆత్మకూరు జాతీయ రహదారి సమీపంలో పర్యా టకానికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. నసన కోట ముత్యాలమ్మ ఆలయం, సీకేపల్లి మండలం కోన శివాలయాల వద్ద పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, టూరిజం రెస్టారెంట్, మరుగు దొడ్లు నిర్మించాలన్నారు. పేరూరు డ్యాం వద్ద బోటింగ్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 17 , 2024 | 12:21 AM