ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి

ABN, Publish Date - Dec 12 , 2024 | 11:57 PM

రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

MLA speaking in the meeting

ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం అర్బన, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇందులో అన్ని చోట్ల ఏకగ్రీవం చేసుకోవాలన్నారు. బలం లేకున్నా అనవసరంగా పోటీ చేసి, గ్రామాల్లో అలజడులు సృష్టించ వద్దన్నారు. ఆయకట్టు రైతులు ఈ విషయంలో ఆలోచించాల న్నారు. ముఖ్యంగా సాగునీటి వనరుల కోసం కృషి చేసే వారినే ఎన్నుకోవాలన్నారు. ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.


పాఠశాలకు రూ. లక్ష విరాళం

రాప్తాడు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ. లక్ష విరాళం అందజేశారు. ఇటీవల రాప్తాడు ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లితండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే... విద్యార్థుల అభివృద్ధి కోసం రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం అనంతపురంలోని తమ క్యాంపు కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్‌ కొండప్ప, సర్పంచ సాకే తిరుపాలు సమక్షంలో పాఠశాల హెచఎం సాంబశివకు రూ. లక్ష చెక్కును అందచేశారు. పాఠశాల లో ఏవై నా సమస్యలు ఉంటే విద్యాశాఖా మంత్రి లోకేశ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం తరపున అన్ని రకాల సహామ సహకారాలు అందిస్తా మన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 12 , 2024 | 11:57 PM