ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Transfer : మొదలైన ఉత్కంఠ

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:11 AM

ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే అనే నిబంధనతో పాటు అడ్మినిస్ర్టేషన గ్రౌండ్స్‌ కింద ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొనడం ఆయా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ, ...

District Housing Office

ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీ గుబులు

పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌

ఉద్యోగుల్లో ఆందోళన

కోరుకున్న స్థానం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు

అనంతపురం సిటీ, ఆగస్టు 18: ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే అనే నిబంధనతో పాటు అడ్మినిస్ర్టేషన గ్రౌండ్స్‌ కింద ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొనడం ఆయా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. ఈక్రమంలోనే కొందరు తమకు నచ్చిన స్థానాల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు.


పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ ఉద్యోగుల్లో గుబులు

ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రధానంగా జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ శాఖల్లోని ఇంజనీరింగ్‌ అధికారుల్లో (ఈఈ, డీఈఈ, ఏఈ, జేఈలు తదితర సిబ్బంది) ఆందోళన మొదలైంది. పైగా ఆయా శాఖల్లో ఈఈ, డీఈఈ, జేఈ, ఏఈల పోస్టులు ఎక్కువ శాతం ఖాళీగా ఉండటం, లేకుంటే కింది స్థాయి ఉద్యోగులకు డీఈఈలుగా బాధ్యతలు అప్పగించడం వంటి పక్రియ ఇప్పటికే ఆశాఖల్లో నెలకొంది. ఈ క్రమంలో బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆయా స్థానాలకు రెగ్యులర్‌ ఉద్యోగులు వస్తారా..? లేక యఽఽథావిధిగా బదిలీల్లోనూ కింది స్థాయి ఉద్యోగులకే ఇనచార్జిల బాధ్యత అప్పగిస్తూ బదిలీలు చేస్తారా? అనే చర్చ సాగుతోంది.

ఉద్యోగుల్లో ఆసక్తి

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు బదిలీల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. కొందరైతే వేచి ఉండలేక తమదైన శైలిలో బదిలీ చేయించుకున్నారు. మిగిలిన వారు నిరాశగా ఎదురుచూస్తుండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా శాఖల ఉద్యోగుల్లో తమకు ఎలాంటి స్థానం దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. త్వరలోనే తమకు బదిలీ రానుందనే విషయంలో ఉద్యోగులకు స్పష్టత వచ్చింది.

నెలాఖరుకు తెర

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ఉత్కంఠకు ఈనెలాఖరుకు తెరపడనున్నట్లు ఆయా వర్గాల సమచారం. బదిలీ ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లో ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగుల వివరాలన్నీ కూడా వచ్చే 15 రోజుల్లో (ఈనెల 31) ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి సమగ్రంగా నివేదించనున్నారు. అడ్మినిస్ర్టేషన గ్రౌండ్స్‌ కింద ఎవరెవరూ అవసరమో వారి వివరాలను కూడా నెలాఖరుకు అందజేయనున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో బదిలీల పక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయా శాఖల ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 19 , 2024 | 12:11 AM

Advertising
Advertising
<