ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : ఆర్యోగశ్రీ ఉన్నా... డబ్బు చెల్లించాల్సిందే..!

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:18 AM

ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్‌ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్‌ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.

Victim's mother talking to MLA Sunitha

రామగిరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్‌ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్‌ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు. తాము పేదలమని, తమ వద్ద డబ్బులు లేవని తెలిపినా రూ.30వేలు చెల్లించకుంటే ఆపరేషన చేయమని ఖరాకండిగా ఆస్పత్రి యాజమా న్యం తెలిపిందన్నారు. ఆ రూ.30వేలకు రసీదు కూడా ఇవ్వలేదని ఎమ్మె ల్యేకు బాధితులు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారులకు పోనచేశారు. ఈ విషయంపై ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై వైద్యాధికారులు సవేరా ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. లేకుంటే బాధితుల ఆగ్రహం చూడాల్సి వస్తుందని ఆస్పత్రి ఎదుటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 12:18 AM