RYTHU DHARNA: పొలాలకు దారి చూపాలని రైతుల ధర్నా
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:58 PM
గ్రీన ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంతో తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండపోతోందని, రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రీన ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంతో తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండపోతోందని, రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలోని కొండకమర్ల పంచాయతీ కొండ తిమ్మయ్యగారిపల్లి, చెరువుమునెప్పగారిపల్లికి చెందిన రైతులు రాజారెడ్డి, మధుసూదనరెడ్డి, ఈశ్వరయ్య మాట్లాడుతూ గ్రీనఫీల్డ్ హైవే పక్కన దాదాపు 500 ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం ఉందన్నారు. ఆ పొలాల్లోకి వెళ్లాలంటే రోడ్డు మొత్తం మూసివేయడంతో దారిలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో కూడా దారి విషయంపై నేషనల్ హైవే కార్యాలయం కడప వారికి విన్నవించామన్నారు. అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పొలాలకు దారి చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి అందించారు. రైతులు ప్రసాద్ రెడ్డి, చలపతి, నారాయణస్వామి, వెంకటేష్, ప్రభాకర్ పాల్గొన్నారు
Updated Date - Dec 21 , 2024 | 11:58 PM