ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

EX MINISTER PALLE: రూ.వందతో కార్యకర్తకు ఆర్థిక భరోసా

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:09 AM

కేవలం వందరుపాయ ల సభ్యత్వంతో కార్యకర్తలకు ఆర్థిక భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇనచార్జి పల్లెరఘునాథరెడ్డి అన్నారు

SPEAKING PALLE RAGHUNATHAREDDY

పుట్టపర్తి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కేవలం వందరుపాయ ల సభ్యత్వంతో కార్యకర్తలకు ఆర్థిక భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇనచార్జి పల్లెరఘునాథరెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం సభ్యత్వంపై పుట్టపర్తిరూరల్‌, అర్బన, బుక్కపట్నం నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఎమ్మెల్యేగా పల్లెసింధూరారెడ్డిని గెలిపించడంలో పార్టీ కుటుంబసభ్యుల కృషి అభినందనీయమన్నారు. వెంగలమ్మచెరువు, పెడపల్లి ప్రాంతాలలో అత్యధిక సభ్యత్వాన్ని చేయడంపై ఆ గ్రామాల నాయకులను అభినందించారు. దేశంలోనే కార్యకర్తలకు ఆర్థిక భరోసా ఇస్తున్న పార్టీ టీడీపీనేనన్నారు. వంద రుపాయిలు సభ్యత్వంతో రెండేళ్లపాటు ప్రమాద బీమా భరోసాను ఇస్తుందన్నారు. సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేలా కృషిచేయాలన్నారు. నాయకులు ఆదినారాయణరెడ్డి, విజయ్‌కుమార్‌, శ్రీరామ్‌నాయక్‌, శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:09 AM