ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITHA: ఫారంపాండ్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Sep 13 , 2024 | 11:30 PM

భూగర్బ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫారంపాండ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక జిల్లాలో మొదటిసారిగా రాప్తాడు మండలం హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రామినేపల్లి గ్రామాల్లో ఫారంపాండ్లు మంజూరయ్యాయి.

MLA Paritala Sunitha doing earth puja

రాప్తాడు, సెప్టెంబరు 13: భూగర్బ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫారంపాండ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక జిల్లాలో మొదటిసారిగా రాప్తాడు మండలం హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రామినేపల్లి గ్రామాల్లో ఫారంపాండ్లు మంజూరయ్యాయి. డ్వామా ఆధ్వర్యంలో వాటర్‌షెడ్‌ పథకం కింద రూ.2.80 కోట్ల విలువ చేసే ఫారంపాండ్లు, చిన్న నీటి కుంటలు, చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. ఈ పనులకు శుక్రవారం పరిటాల సునీత భూమి చేశారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయన్నారు. రైతులు తమ పొలాల్లో ఫారంపాండ్లు తవ్వితే స్థలం వృథా అవుతుందని ఆలోచిస్తే భవిష్యత్తులో నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఫారంపాండ్లతో వర్షపు నీరు భూమిలో ఇంకి భూగర్బ జలాలు పెరుగుతాయన్నారు. మంజూరైన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే పథకాలు ఏవీ చేయలేదన్నారు. ఏపీడీ సుధాకర్‌రెడ్డి, అనురాధ, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, మండల ఇనచార్జి ధర్మవరపు మురళి, కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచలు తిరుపాలు, శీనయ్య, ఎంపీటీసీ జాఫర్‌, హంపాపురం జయప్ప, నంబూరి రమణ, సాకే జయరాముడు, మరూరు గోపాల్‌, నంబూరి ప్రతాప్‌, డీలర్లు పార్థసారఽథి, మహమ్మద్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు మధు, ఉజ్జినేశ్వర పాల్గొన్నారు.

వాటర్‌షెడ్‌ చైర్మన్ల ఎంపిక: మండలంలోని గొందిరెడ్డిపల్లి, హంపాపురం, రామినేపల్లి గ్రామాల వాటర్‌షెడ్‌ చైర్మన్లను ఎంపిక చేశారు. గొం దిరెడ్డిపల్లి మల్లికార్జున, హంపాపురం యోగి, రామినేపల్లి పోతులయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే పరిటాల సునీత చైర్మన్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందచేసి అభినందించారు.

Updated Date - Sep 13 , 2024 | 11:31 PM

Advertising
Advertising