AMILINENI CAMPAIN: చీకటి రాజ్యం నుంచి వెలుగులోకి రావాలి
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:03 AM
చీకటి రాజ్యం నుంచి ప్రజలు వెలుగులోకి రావాలని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మండలంలోని అపిలేపల్లి, జానంపల్లి, యర్రగుంట, అల్లాపురం, బసాపురం, మాయదారులపల్లి, వడ్డీపాల్యం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిలినేనికి నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు.
వయోవృద్ధుడి ఆశీర్వాదం తీసుకున్న అమిలినేని
కుందుర్పి, ఏప్రిల్ 28: చీకటి రాజ్యం నుంచి ప్రజలు వెలుగులోకి రావాలని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మండలంలోని అపిలేపల్లి, జానంపల్లి, యర్రగుంట, అల్లాపురం, బసాపురం, మాయదారులపల్లి, వడ్డీపాల్యం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిలినేనికి నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. సురేంద్రబాబుకు మద్దతుగా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి 30 కుటుంబాలకు టీడీపీలో చేరాయి. రోడ్‌షో సందర్భంగా గ్రామానికి చెందిన వయోవృద్ధుడు శ్రీరంగప్ప ఎంతో ఉత్సాహంతో వారి వెంట నడుస్తున్న ఆయనను చూసిన అమిలినేని కిందకు దిగి వచ్చి ఆయన పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అమిలినేని మాట్లాడుతూ ఇలాంటి చీకటి రాష్ట్రం దేశంలో ఎక్కడాలేదని, ఈ చేతకాని జగన్మోహనరెడ్డి పాలనలోనే సాధ్యమైందని, మే 13 నుంచి వెలుగు బాట పట్టడానికి అవకాశం వచ్చిందన్నారు. వలంటీర్లకు కూడా రూ.పది వేలు జీతాలు ఇస్తారని చంద్రబాబునాయుడు ప్రకటించారని, అందుకే కేవలం 60 వేల మంది మాత్రమే రాజీనామా చేశారని గుర్తుచేశారు. అందరికీ అందుబాటులో ఉండి మీకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు.
ప్రజల కష్టాలను కళ్లారా చూస్తున్నానని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకునైనా నిధులు తీసుకువస్తానని ఏపీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించి ఇండసీ్ట్రయల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. కుందుర్పి బ్రాంచ కెనాల్ పూర్తిచేసి రైతులను ఆదుకుంటానన్నారు. పవనకళ్యాణ్ కూటమికి ఆద్యుడని, ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేశారని, రాషా్ట్రనికి రాజధాని, అప్పుల భారం నుంచి బయటకు పడాలనే ఎనడీఏతో జతకట్టాము. గ్రామానికి అవసరమైన విద్యుత సబ్ స్టేషన అధికారంలోకి వచ్చిన తరువాత, ఏర్పాటుకు చర్యలు చేపడతాం. ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సమస్య లేకుండా చూస్తాం. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా వైసీపీ ఎంపీటీసీ కవితమ్మ వడ్డే రామాంజనేయులు, కురుబ హనుమంతరాయుడు, ఆనంద్ టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి అమిలినేని సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 50 వేల మెజార్టీతో టీడీపీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ ధనుంజయ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున, మాజీ ఎంపీపీ దీనమ్మ, మాజీ మండల కన్వీనర్ కర్తనపర్తి రామాంజనేయులు, యర్రగుంట ఆనంద, శివలింగప్ప, వడ్లప్ప గారి వీరన్న, పెద్ద నరసింహప్ప, మల్లికార్జున, రాఘవేంద్ర, చిత్రలింగప్ప, ప్రసాద్, రామాంజనేయులు, వీరుపాక్షి, రవి, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత
మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని అమిలినేని కుటుంబ సభ్యులు అన్నారు. మండల పరిధిలోని రుద్రంపల్లి, గురివేపల్లి, ఎనుములదొడ్డి, బోధపల్లి, ఎస్ మల్లాపురం, మల్లాపురం తాండా గ్రామాల్లో అమిలినేని సురేంద్రబాబు సోదరి రాధా మాధవి, కుమార్తె చరిత, కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. మే 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యుతలను గెలిపించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....