ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MILK FARMERS: పాలరైతులకు న్యాయం చేయండి

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:34 PM

అమూల్‌ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్‌ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

CPI leaders and milk producers came to complain to the collector

అనంతపురం టౌన, ఆగస్టు 3: అమూల్‌ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్‌ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వంద మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అమూల్‌ సంస్థకు పాలు సేకరించి ఇస్తున్నారన్నారు. ఈనెల 10 నుంచి పాలసేకరణ నిలుపుదల చేస్తున్నట్లు అమూల్‌ సంస్థ నిర్వాహకులు చెప్పారన్నారు. జిల్లాలో 16 వేల లీటర్లు సేకరిస్తున్నారని, ఒక్కో సంఘం రూ.2లక్షలు ఖర్చుపెట్టి యంత్రాలు తెచ్చుకున్నాయన్నారు. ఉన్నపళంగా అమూల్‌ పాలసేకరణ ఆపితే వారిపరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన పాలకు బకాయి బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. పాడి రైతులను ఆదుకోవాలని కలెక్టరును కోరామన్నారు. రైతుసంఘం నాయకుడు రామక్రిష్ణ, పాలసేకరణ సొసైటీ సభ్యులు నాగరాజు, మాధవి, శ్రీధర్రెడ్డి, శివలింగ, కళావతి, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 11:34 PM

Advertising
Advertising
<