ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Good Days : మళ్లీ మంచిరోజులు

ABN, Publish Date - Aug 26 , 2024 | 12:41 AM

వైసీపీ పాలనలో కుదేలైన సూక్ష సేద్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్రిప్‌, స్ర్పింక్లర్ల సరఫరా కోసం భారీ టార్గెట్‌ను ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 37500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింక్లర్ల మంజూ రు చేయాలన్న లక్ష్యం విధించారు. ఇదే క్రమంలో రైతు సేవా కేంద్రాల్లో ఈనెల మొదటి వారం నుంచి రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ఇప్పటి దాకా ...

సూక్ష్మసేద్యానికి ప్రోత్సాహం దిశగా అడుగులు

జిల్లాకు భారీగా టార్గెట్‌ విధించిన రాష్ట్ర ప్రభుత్వం

37,500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింక్లర్ల ఏర్పాటు లక్ష్యం

ఈనెల మొదటివారం నుంచి రిజిస్ట్రేషన ఆరంభం

వైసీపీ పాలనలో కంపెనీలకు పేరుకుపోయిన బకాయిలు

అనంతపురం అర్బన/ యాడికి, ఆగస్టు 25: వైసీపీ పాలనలో కుదేలైన సూక్ష సేద్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్రిప్‌, స్ర్పింక్లర్ల సరఫరా కోసం భారీ టార్గెట్‌ను ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 37500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింక్లర్ల మంజూ రు చేయాలన్న లక్ష్యం విధించారు. ఇదే క్రమంలో రైతు సేవా కేంద్రాల్లో ఈనెల మొదటి వారం నుంచి రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ఇప్పటి దాకా సబ్సిడీ ధరలు ఖరారు చేయలేదు. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో డ్రిప్‌ కంపెనీలకు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులు


క్షేత్ర స్థాయిలోకి వె ళ్లేందుకు ముందడుగు వేయడం లేదని సమాచారం. డ్రిప్‌ కంపెనీల రాష్ట్ర ఉన్నతా ధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల రిజిస్ర్టేషన ప్రక్రియ మందకొడిగా సాగుతోందన్న అభిప్రాయాలున్నాయి.

జిల్లాకు భారీ టార్గెట్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాకు భారీగానే డ్రిప్‌, స్ర్పింక్లర్ల సరఫరాను టార్గెట్‌గా విధించింది. గతంలో ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా 23వేల హెక్టార్ల దాకా లక్ష్యం విధించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటు న్నారు. ఇందులో కేవలం అనంత జిల్లా 13వేల హెక్టార్లు ఉండింది. ఈ సారి 37500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింక్లర్ల మంజూరుకు టార్గెట్‌ విధించారు. ఇందుకు సంతోష పడాలో..? లేక కంపెనీల ప్రతినిధులు క్షేత్ర స్థాయికి వెళ్లపోవడంతో బాధపడాలో తోచని అయోమయంలో ఏపీ ఎంఐపీ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కు ఆరు నెలల ముందు నుంచి డ్రిప్‌ మంజూరును కంపెనీలు ఆపేశాయి. పనులు లేకపోవడంతో డ్రిప్‌ కంపెనీల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్‌ సిబ్బందిని తొలగించినట్లు సమాచారం. మరోవైపు పలు కంపెనీలకు డీలర్లు దూరమైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తేనే తిరిగి ఫీల్డ్‌ సిబ్బందిని నియమించుకోవడంతోపాటు డీలర్లను నియమించుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు పలు కంపెనీల ప్రతినిధుల నుంచి వినిపిస్తున్నాయి. బకాయిలు విడుదల చేయకపోతే డ్రిప్‌ మంజూరు ప్రక్రియ మరింత ఆలస్యం కావడం తథ్యమన్న వాదనలున్నాయి.

ఖరారుకాని సబ్సిడీ

జిల్లాకు ఈ సారి భారీగా డ్రిప్‌ పరికరాల మంజూరు లక్ష్యం విధించినప్పటికీ ఇంకా సబ్సిడీ ధరలు ఖరారు చేయలేదు. గతంలో టీడీపీ హయాంలో ఉమ్మడి అనంత జిల్లాలో సూక్ష్మసేద్యం పరికరాలకు పదెకరాల దాకా 90 శాతం సబ్సిడీ వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం ఉచి తంగా డ్రిప్‌ పరికరాలు సరఫరా చేశారు. గత వైసీపీ పాలనలో సూక్ష్మసేద్య పరికరాల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలను మార్చారు. ఐదెకరాల దాకా 90 శాతం, ఆపైన 70 శాతం సబ్సిడీని మాత్రమే వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం ఉచిత సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఇతర కేటగిరిల రైతుల తరహాలోనే సబ్సిడీ పోను మిగతా డబ్బులు చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ రైతులకు షరతు పెట్టారు. ఎన్నికల హామీ మేరకు గతంలో టీడీపీ అమలు చేసిన పాత పద్ధతిలోనే డ్రిప్‌ పరికరాలు మంజూరు చేసేలా సబ్సిడీ ధరలు ఖరారు చేయాలని రైతులు కోరుతున్నారు.

రూ.130 కోట్లకుపైగా బకాయిలు

గత వైసీపీ పాలనలో జిల్లాలో డ్రిప్‌, స్ర్పింక్లర్లు సరఫరా చేసిన కంపెనీలకు దాదాపు రూ.130 కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో భారీగానే బకాయిలు పేరుకుపోయినట్లు తెలిసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో కంపెనీలు రిజిస్ర్టేషన ప్రక్రియకు ముందుకొచ్చాయి. ఇటీవల కొంత బకాయి సొమ్ము విడుదల చేసినప్పటికీ ఇంకా ఎక్కువ శాతం డబ్బులు రావాల్సి ఉండటంతో డ్రిప్‌ కంపెనీల రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో కంపెనీ అధికారులకు ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీఎంఐపీ అధికారుల ఒత్తిడులతో డ్రిప్‌ కోసం రిజిస్ర్టేషన చేసుకోవాలం టూ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడంతోనే కంపెనీల ప్రతినిధులు సరిపెట్టారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయికి సిబ్బందిని పంపించి రిజిస్ర్టేషన తర్వాత చేయాల్సిన పనులు చేయడం లేదన్న విమర్శలున్నాయి.

ముందుకు సాగని రిజిసే్ట్రషన ప్రక్రియ

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 10137 మంది రైతులు 15820 హెక్టార్లల్లో డ్రిప్‌ పరికరాల కోసం తమ పేర్లు రిజిస్ర్టేషన చేసుకున్నారు. మరోవైపు గత ఏడాది రిజిస్ర్టేషన చేసుకున్నప్పటికీ 17096 మంది రైతులకు 22923 హెక్టార్లల్లో డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో గతేడాది రిజిస్ర్టేషన చేసుకొని పెండింగ్‌లోని రైతులను ఈ ఏడాది జాబితాలోకి తీసుకొని డ్రి ప్‌ మంజూరు చేస్తామని ఏపీఎంఐపీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతేడాది దరఖాస్తు చేసుకున్న రైతుల్లో ఎవరెవరు డ్రిప్‌ పరికరాలు తీసుకునేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయిలో ఏపీఎంఐపీ అధికారులు, సిబ్బంది, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులు వెళితేనే అర్హుల జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

త్వరగా ఇవ్వాలి

మూడెకరాల్లో కూరగాయల సాగు చేసేందుకు డ్రిప్‌ కోసం రిజిస్ర్టేషన చేసుకున్నా. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. అందుకే గతంలో దరఖాస్తు చేసుకోలేదు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో డ్రిప్‌ కోసం రైతు సేవా కేంద్రంలో రిజిస్ర్టేషన చేసుకున్నా.

- రైతు పుల్లారెడ్డి, ఓబుళాపురం, యాడికి మండలం

వేగవంతం చేయాలి

సబ్సిడీ ధరలు ఖరారు చేసి డ్రిప్‌ మంజూరును వేగవంతం చేయాలి. కంపెనీల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో డ్రిప్‌ మంజూరుకు సంబంధించిన పనులు మొదలుపెట్టేలా చూడాలి. గతంలో టీడీపీ హయాంలో సూక్ష్మసేద్యం పరికరాలకు వర్తింపజేసిన సబ్సిడీని కొనసాగించాలి. సీఎం చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 90 శాతం సబ్సిడీ తో తిరిగి పరికరాలు సరఫరా చేసి, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీని వర్తింపజేయాలి.

- చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 26 , 2024 | 12:41 AM

Advertising
Advertising
<