MLA SUNITHA : పల్లెలకు మంచిరోజులు
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:38 PM
కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మంచిరోజులు వచ్చాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని బీ యాలేరులో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
ఆత్మకూరు అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మంచిరోజులు వచ్చాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని బీ యాలేరులో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో రూ.36 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ.9.20 లక్షలతో నిర్మించనున్న రైతుల షెడ్లకు భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఐదే ళ్ల వైసీపీ పాలనలో ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అమలుచేసి గ్రామాన్ని అభివద్ధిపథంలో నడిపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ప్రత్యేక అధికారి ప్రతా్‌పరెడ్డి, ఏపీడీ అనూరాధ, తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడీఓ లక్ష్మీనరసింహులు, ఏఓ సుచరిత, ఏపీఓ సుజాత, టీడీపీ మండల నాయకులు శ్రీనివాసులు, శశాంక చౌదరి, నారాయణస్వామి, బండి పరుశురామ్, క్రిష్ణమోహన చౌదరి, వెంకటనారాయణ, నాగేంద్ర, ఏడీ ఈశ్వరయ్య, ప్రసాద్, అనిల్ పాల్గొన్నారు.
Updated Date - Oct 15 , 2024 | 11:39 PM