మంచి నడవడిక అలవర్చుకోవాలి: కాలవ
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:14 AM
సమాజంలో ప్రతిఒక్కరూ మంచి నడవడికలు అలవరచుకోవాలని, అప్పుడే మంచి వ్యక్తులుగా గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
రాయదుర్గం రూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతిఒక్కరూ మంచి నడవడికలు అలవరచుకోవాలని, అప్పుడే మంచి వ్యక్తులుగా గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మండలంలోని చదం గ్రామంలో క్రీస్తు నూతన ప్రార్థన మందిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరూ మంచి నడివడికలను అలవర్చుకోవాలన్నారు. ప్రేమ , త్యాగం ఉన్నవారు సమాజంలో మంచి వ్యక్తులుగా పేరు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ హనుమంతు, టీడీపీ నాయకుడు పాటిల్ అజయ్‌రెడ్డి, ఫాస్టర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Dec 21 , 2024 | 01:14 AM