MLA SHRAVANISHREE : పేదలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:13 AM
పేదలకు అండగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గురవయ్యసేను కొట్టాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గురవయ్యసేను కొట్టాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇకపై ఒక నెలలో పింఛన తీసుకోని వారికి రెం డింటినీ మరుసటి నెలలో ఇచ్చే అవకాశంను ప్రభుత్వం కల్పించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన కార్డు లు, కార్డులో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించందని తెలిపారు. అలాగే బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీలో మౌలిక సదుపాయల కోసం త్వరలోనే దాదాపు రూ. 2కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు పలు కాలనీల్లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యే కాధికారి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ సాల్మన రాజ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, మండల కన్వీ నర్ అశోక్‌కుమార్, టీడీపీ నాయకులు పసుపుల శ్రీరామరెడ్డి, లక్ష్మీనారా యణ, ఎస్ నారాయణస్వామి, పొడరాళ్ల రవీంద్ర, కేశన్న, ఓబులపతి, సీ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 01 , 2024 | 12:13 AM