PALLE PANDUGA :
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:09 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృ ద్ధి దిశగా పరుగులు తీస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొం దని ఎమ్మెల్యే పరిటాలసునీత పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సోమవారం దాదులూరు పంచాయతీలో ఆమె పర్యటించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు పూర్వవైభవం
పల్లెపండుగ వారోత్సవాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత
కనగానపల్లి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృ ద్ధి దిశగా పరుగులు తీస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొం దని ఎమ్మెల్యే పరిటాలసునీత పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సోమవారం దాదులూరు పంచాయతీలో ఆమె పర్యటించారు. ముందుగా దాదులూరు పోతలయ్య స్వామిని దర్శించుకుని, హాంద్రీనీవా ద్వారా చెరువులకు వస్తున్న కృష్ణజలాలకు గంగపూజ చేశారు. అనంతరం దాదులూరు పంచాయతీలో రూ.41లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణాని కి భూమి పూజ చేసి, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన కల్యాణ్ చొరవతో రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె పండుగ కార్యక్రమం చేపట్టామన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పల్లె పండుగ వారోత్స వాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్నపనులలో నాణ్యత లోపిస్తే బిల్లులు రావన్నారు. మున్ముందు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లపట్టాలతో పాటు పరిటాల రవీంద్ర పేరుమీద కాలనీలు నిర్మిస్తామన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ అనిల్‌కుమార్, డీఈ నారాయణస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేశ, కన్వీనర్ యాతం పోతలయ్య, క్లస్టర్ ఇనచార్జ్ సుధాకర్‌చౌదరి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 15 , 2024 | 12:09 AM