MLA DAGGUPATI : నగరాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:30 AM
అనంత నగరం అభివృద్ధికి త గిన నిధులు మంజూరు చే యాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దగ్గు పాటి వెంకటేశ్వరప్రసాద్ కో రారు. ఆయన గురువారం అ సెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంత పురం నగరంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సా యంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
సీఎం చంద్రంబాబును కోరిన ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం అర్బన, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అనంత నగరం అభివృద్ధికి త గిన నిధులు మంజూరు చే యాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దగ్గు పాటి వెంకటేశ్వరప్రసాద్ కో రారు. ఆయన గురువారం అ సెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంత పురం నగరంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సా యంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు నడిమి వంక, మరువ వంక పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వంకల ఇరువైపుల ప్రొ టెక్షన వాల్స్ నిర్మించాల్సి ఉందని, అందుకు రూ.86 కోట్లతో నివేదికలు సిద్ధం చేశామన్నారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతలోని డంపిం గ్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించేందుకు స్థల కేటాయింపుతోపాటు నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. ప్రాధాన్యత వారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అర్బన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం నమోదుపైనా సీఎం చర్చించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 22 , 2024 | 12:30 AM