ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనంతకు అండర్‌ డ్రైనేజీని మంజూరు చేయండి

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:04 AM

అనంతపురం నగరానికి అండర్‌ డ్రైనేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.

Daggupati with CM

అనంతపురం అర్బన, ఆగస్టు 29: అనంతపురం నగరానికి అండర్‌ డ్రైనేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి సీఎంను ఎమ్మెల్యే కలిశారు. నగరంలో నడిమి, వరువ వంకల సమస్యలతోపాటు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. అనంత అర్బనకు అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అనంతలో అభివృద్ధి పనులకు నిధులివ్వండి: నగరంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ కోరారు. గురువారం విజయవాడలోని ఏపీ సచివాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుతోపాటు డంపింగ్‌ యార్డు తరలింపు, రోడ్ల నిర్మాణం తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా కేంద్రం అయినా కనీస మౌలిక సదుపాయలు లేకుండాపోయాయన్నారు.


అనేక కాలనీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలున్నాయన్నారు. రక్షిత నీటి సరఫరా, వీధి లైట్లు, టాయిలెట్‌ సదుపాయలు కల్పించాల్సి ఉందన్నారు. గతంలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు సంబంధించి రూ.25 కోట్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. నగరంలోని ఇండోర్‌ స్టేడియం మరమ్మతులు, నూతన ఓపెన జిమ్‌ల ఏర్పాటు, పాత జిమ్‌ల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు, బీసీ సంఘం నాయకులు జోగి రాజేంద్రలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడును ఎమ్మెల్యే కలిశారు. అనంతపురం నగరంలో బీసీ భవనను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ... జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు ఫోనలో మాట్లాడారు. బీసీ భవన కోసం స్థల సేకరణ పూర్తి చేసి, నిధులు ఎంత అవసరమో అంచనాలు సిద్ధం చేసి పంపాలని సూచించారు.

Updated Date - Aug 30 , 2024 | 12:04 AM

Advertising
Advertising