ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education : గాలిలో గురువులు

ABN, Publish Date - Aug 27 , 2024 | 12:30 AM

బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. పాఠాలు బోధించాల్సిన గురువులు 27 రోజులుగా పని లేకుండా ఇంటికి.. ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగున్నారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు నుంచి కలెక్టర్‌ రీపాట్రియేషన (మునుపటి స్థానానికి పంపండం) చేసిన టీచర్ల పరిస్థితి ఇది. కొత్తగా ప్రాజెక్టులోకి రావాలనుకున్న వారి పరిస్థితి సైతం ఇలాగే ఉంది. పోస్టుల భర్తీకి 110 దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్ర్కూటినీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో పాలన గందరగోళంగా ...

Project Office (File)

ప్రాజెక్టు నుంచి రీపాట్రియేషన

27 రోజులుగా రీ పోస్టింగ్‌ లేదు

కలెక్టర్‌కు ఫైల్‌ పంపిన డీఈఓ

ఎస్‌ఎస్‌ఏలో అటకెక్కిన దరఖాస్తులు

విద్యాశాఖ, ప్రాజెక్టులో గందరగోళం

అనంతపురం విద్య, ఆగస్టు 26: బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. పాఠాలు బోధించాల్సిన గురువులు 27 రోజులుగా పని లేకుండా ఇంటికి.. ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగున్నారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు నుంచి కలెక్టర్‌ రీపాట్రియేషన (మునుపటి స్థానానికి పంపండం) చేసిన టీచర్ల పరిస్థితి ఇది. కొత్తగా ప్రాజెక్టులోకి రావాలనుకున్న వారి పరిస్థితి సైతం ఇలాగే ఉంది. పోస్టుల భర్తీకి 110 దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్ర్కూటినీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో పాలన గందరగోళంగా


తయారైంది. జిల్లా విద్యాశాఖ, కలెక్టరేట్‌ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

గత నెలలో రీపాట్రియేషన..

జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న సెక్టోరియల్‌, అసెస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులను గత నెల 31న కలెక్టర్‌ రీపాట్రియేషన చేశారు. ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, జీసీడీఓ మహేశ్వరి, అసిస్టెంట్‌ ఏఎంఓలు చంద్రమెహనరెడ్డి, మాధవరెడ్డి, అసిస్టెంట్‌ సీఎంఓ గోపాల్‌, అసిస్టెంట్‌ అలెస్కో గోవింద్‌ రెడ్డి, అసిస్టెంట్‌ ఐఈడీ షమ, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ రాంప్రసాద్‌ ఈ జాబితాలో ఉన్నారు. ప్రాజెక్టు నుంచి అందరూ వెళితే సమస్య అని ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్‌ సీఎంఓ గోపాల్‌ను కొంతకాలం అక్కడే పనిచేసేలా మినహాయింపు ఇచ్చారు. రీపాట్రియేషన అయిన అసిస్టెంట్‌ ఐఈడీ షమ అనంతపురంలోని ప్రాజెక్టు నుంచి రిలీవ్‌ అయ్యారు. తన సొంత జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. మిగిలిన ఐదుగురు టీచర్లు సైతం ఈ నెల 1వ తేదీనే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేసుకున్నారు. వీరిని వెంటనే పాఠశాలలను కేటాయిస్తూ (రీ పోస్టింగ్‌) ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఆ దిశగా చర్యలు లేవు.

కొత్త వాళ్లకు దారేది..?

ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిని రీపాట్రియేషన చేసిన కలెక్టర్‌.. కొత్తవారితో భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఔత్సాహిత టీచర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 9వ వరకూ ప్రాజెక్టు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. 32 మంది ఉపాధ్యాయుల నుంచి 110 అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ వాటి స్ర్కూటినీ చేయలేదు. పాతవారు వెళ్లిపోయారు. కొత్తవారి దరఖాస్తులు మూలన పడ్డాయి. దీంతో వెళ్లిపోయిన సెక్టోరియల్‌ అధికారుల పని ఉన్న సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు, ఇతర సిబ్బందిపై పడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పాలన గందరగోళంగా తయారైంది. విద్యాశాఖ అధికారి నిర్ణయాలపై ఉపాధ్యాయులు, సంఘాల నేతలు, ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

బడి లేదు.. ప్రాజెక్టూ లేదు..

ప్రాజెక్టు నుంచి రీపాట్రియేషన తరువాత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేసుకున్న టీచర్లకు డీఈఓ వెంటనే రీ పోస్టింగ్‌ ఇవ్వాలి. అపాయింటింగ్‌ అథారిటీ డీఈఓనే. కానీ ఈ చిన్న పనిని సైతం డీఈఓ కలెక్టర్‌ మీదకు తోసేసినట్లు తెలుస్తోంది. పోస్టింగ్‌ ఇచ్చే అధికారం తనకు ఉన్నా.. ఫైల్‌ను కలెక్టర్‌కు పెట్టడంతో ఈ సమస్య నానుతూనే ఉంది. తన పనుల్లో కలెక్టర్‌ బిజీగా ఉండటంతో ఈ సమస్య మరుగున పడింది. డీఈఓ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసుకుని 27 రోజులు గడిచింది. పాఠశాలకు వెళ్లలేక, ప్రాజెక్టులో పనులు చేయలేక ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పోస్టింగ్‌ ఇచ్చి ఉంటే బడికి వెళ్లి పాఠాలు చెప్పేవారు. విద్యార్థులకు మేలు జరిగేది. ప్రాజెక్టులో ఉన్నా.. అక్కడి పనులు చూసుకునేవారు. దిక్కుతోచక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 27 , 2024 | 12:33 AM

Advertising
Advertising
<