MLA SUNITHA: ఉద్యాన పంటలే వ్యవసాయానికి ఊపిరి
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:42 PM
కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఉద్యాన పంటలు ఊపిరి లాంటివని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, మండలాలకు చెందిన హార్టికల్చర్ అధికారులు ఎమ్మెల్యేను కలిశారు.
అనంతపురంరూరల్, అక్టోబరు 9: కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఉద్యాన పంటలు ఊపిరి లాంటివని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, మండలాలకు చెందిన హార్టికల్చర్ అధికారులు ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం వారితో పంటల పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే చర్చించారు. వర్షాభావ పరిస్థితుల వలన ఖరీ్‌ఫలో పంటలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్లు, బావుల కింద ఉద్యాన పంటల సాగుతోనే రైతులు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానశాఖ అందిస్తున్న పథకాల గురించి అధికారులు వివరించారు. అనంతరం క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్యేను నియోజకవర్గానికి చెందిన పలువురు అధికారులు కలిశారు. ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డీ వెంకటనాయుడు ఎమ్మెల్యేను కలిశారు. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శక్తి విజయోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఆహ్వానం అందింది. 11న విజయవాడ పున్నమి ఘూట్‌లో కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా పర్యాటకశాఖ అధికారి జయకుమార్ ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఆత్మకూరు: మండల కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రిని అందజేశారు. మండల కన్వీనర్ శ్రీనివాసులు, నారాయణస్వామి, శశాంక చౌదరి, వేణుగోపాల్, కుమర్ కొండయ్య పాల్గొన్నారు.
Updated Date - Oct 09 , 2024 | 11:42 PM