TDP రైతులను ఇబ్బంది పెడితే తరిమికొడతాం: టీడీపీ
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:16 AM
చెరువు మట్టి విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొడతామని టీడీపీ నాయకులు, రైతులు తెలిపారు. చెరువు మట్టిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాయలచెరువులో టీడీపీ నాయకులు, రైతులు సమావేశం నిర్వహించి మాట్లాడారు.
యాడికి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): చెరువు మట్టి విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్న వైసీపీ నాయకులను తరిమి కొడతామని టీడీపీ నాయకులు, రైతులు తెలిపారు. చెరువు మట్టిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాయలచెరువులో టీడీపీ నాయకులు, రైతులు సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రాయలచెరువులోని చెరువు మట్టిని తాము సొంత వ్యయంతో టిప్పర్లను ఏర్పాటు చేసుకొని పొలాలకు తోలుకుంటున్నామని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు కొనలేక చెరువు మట్టిని తోలుకొని పొలాలను సారవంతం చేసుకుంటున్నామన్నారు. వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమే్‌షనాయుడు గత ఐదేళ్లకాలంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చెరువు మట్టి దోపిడి చేస్తున్నారని అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇలా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వైసీపీ నాయకులను తరిమి కొడతామని హెచ్చరించారు. చిన్నపేట ఆంజనేయస్వామిమాన్యం, యాడికి భైరవకొండ తదితర ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని తరలించిన వైసీపీ నాయకులు చెరువు మట్టిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, నాయకులు శ్యాంసుందర్‌నాయుడు, పరిమి చరణ్, నాగమునిరెడ్డి, త్రినాథ్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, రైతులు నారాయణరెడ్డి, వెంకటసుబ్బయ్య, సుదర్శన, ప్రభాకర్, కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Dec 24 , 2024 | 01:16 AM