ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IKEA APP : ఐకియా.. మోసపోయా..!

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:49 AM

ఆనలైన ద్వారా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నిలువునా మోసపోయారు. ఉన్న డబ్బును మోసగాళ్ల చేతిలో పెట్టి నిండా మునిగారు. తొలుత నమ్మకం కలిగేలా వ్యవహారాన్ని నడిపిన ఆనలైన యాప్‌ నిర్వాహకులు.. నమ్మకం బలపడ్డాక పెద్ద ఎత్తున సొమ్ము పోగుచేసుకుని మాయమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సుమారు రూ.2 కోట్ల దాకా మోసపోయారు. ఐకియా పేరిట ఓ యాప్‌ 2023 డిసెంబరులో రాయదుర్గం నియోజకవర్గంలో పరిచమైంది. చవక ధరలకు ఫర్నిచర్‌ వ్యాపారాన్ని యాప్‌ ద్వారా ప్రారంభించారు. ధర రూ.625 మొదలై..

Business table in the IKEA app

రూ.2 కోట్లకు ఆనలైన యాప్‌ టోపీ

పాత చైన లింక్‌ పద్ధతిలో భారీ వసూళ్లు

రూ.లక్షకు 12 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామని..

ఫర్నిచర్‌ వ్యాపారం పేరిట పరిచయమై.. బురిడీ

రాయదుర్గం, ఏప్రిల్‌ 28: ఆనలైన ద్వారా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నిలువునా మోసపోయారు. ఉన్న డబ్బును మోసగాళ్ల చేతిలో పెట్టి నిండా మునిగారు. తొలుత నమ్మకం కలిగేలా వ్యవహారాన్ని నడిపిన ఆనలైన యాప్‌ నిర్వాహకులు.. నమ్మకం బలపడ్డాక పెద్ద ఎత్తున సొమ్ము పోగుచేసుకుని మాయమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సుమారు రూ.2 కోట్ల దాకా మోసపోయారు. ఐకియా పేరిట ఓ యాప్‌ 2023 డిసెంబరులో రాయదుర్గం నియోజకవర్గంలో పరిచమైంది. చవక ధరలకు ఫర్నిచర్‌ వ్యాపారాన్ని యాప్‌ ద్వారా ప్రారంభించారు. ధర రూ.625 మొదలై.. రూ.లక్షల వరకు చూపించారు. సభ్యులు తమ శక్తి మేరకు సొమ్ము చెల్లించి ఫర్నిచర్‌ కొనాలి. సభ్యులను చేర్పించాలి. ఉదాహరణకు..


రూ.625 చెల్లించి ఒక వస్తువు కొంటే 45 రోజులకు రూ.1800 యాప్‌ నిర్వాహకులు చెల్లిస్తారు. సభ్యులను చేర్చేకొద్దీ ఆదాయాన్ని పెంచుతూపోతారు. పాత పద్ధతిలోనే ఆనలైనలో చైనలింక్‌ను ప్రయోగించారు. మొదట్లో చాలామందికి ఆదాయాన్ని రుచి చూపించారు. దీంతో ఆశపడిన చాలామంది నిరుద్యోగులు పల్లెలకు సైతం విస్తరించారు. తమకింద సభ్యులను చేర్చుకుంటూ వచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 400 మంది దాకా సభ్యులు ఉన్నట్లు సమాచారం. డిసెంబరు నుంచి యాప్‌లో పెట్టుబడి పెడుతూ వచ్చిన వారందరికీ లాభాలు ఇస్తూ వచ్చారు. నమ్మకం బలపడిందని తేలా.. 20 రోజుల క్రితం యాప్‌ నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము పోగేసుకునే వ్యూహాన్ని అమలు చేశారు. చెల్లింపుల గడువును 45 రోజుల నుంచి 12 రోజులకు కుదించారు. రూ.లక్ష చెల్లిస్తే.. 12 రోజుల్లో రూ.3 లక్షలు చెల్లిస్తామని ఊరించారు. దీంతో ఆశపడిన చాలామంది లక్షల్లో పెట్టారు. వీరిలో యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. కొందరు బంగారం,


ఆస్తులు తాకట్టు పెట్టి మరీ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. 12 రోజుల్లో సొమ్ము వెనక్కు వస్తుందని ఎదురుచూశారు. కానీ డబ్బులు తిరిగిరాకపోగా.. యాప్‌ స్తంభించింది. ఈ నెల 23వ తేదీ నుంచి లింక్‌ ఓపెన కాలేదు. దీంతో సొమ్ము చెల్లించినవారు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

ఉద్యోగులే ఎక్కువ..

ఆనలైన యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయినవారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండడం కొసమెరుపు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ కొందరు పోలీసులు కూడా అత్యాశకుపోయి మోసపోయినట్లు తెలిసింది. ఒక్కొక్కరు రూ.5 లక్షలకుపైగా చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. రాయదుర్గంలో ఓ వైద్యుడు రూ.20 లక్షలు మోసపోయినట్లు తెలిసింది. రాయదుర్గం మండలంలోని కాశీపురం, రాతిబావివంక, రాయదుర్గం పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతాలలో సుమారు రూ.కోటి దాకా మోసపోయారని తెలిసింది. కొంతమంది విద్యార్థులు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. డబ్బుల కోసం యాప్‌ను పరిచయం చేసిన వారితో పాటు సభ్యులుగా చేర్పించిన వారితోనూ కొందరు గొడవపడుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:49 AM

Advertising
Advertising